తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఒకరిపై మరోకర విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీని ఎండగట్టేందుకు చంద్రబాబు తన ప్రచారంలో ఎక్కువ శాతం కేసీఆర్ - జగన్ దోస్తీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని జనాల్లో ఎండగట్టాలనే పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు
సెటిమెంట్ తో ఓట్లు సాధ్యం
ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రతీసారి చంద్రబాబు జగన్ - కేసీఆర్ దోస్తీ అంశాన్ని ప్రస్తావించడం.. ఇదే అంశంపై జనాల్లో ఎండగట్టాలనే పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇవ్వడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే వాదన ఉంది. చంద్రబాబు తమపై పెత్తనం చలాయించేందుకు వస్తున్నారని కేసీఆర్ ఎన్నికల్లో విస్తృతం ప్రచారం చేశారు. ఇలా జనాల్లో మళ్లీ సెంటిమెంట్ రగిల్చి.. కేసీఆర్ ఓట్ల రాబట్టారనే విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కేటీఆర్ బాటలో చంద్రబాబు..
సరిగ్గా ఇదే తరహా వ్యూహాన్ని చంద్రబాబు ఏపీలో అనుసరిస్తున్నారు. కేసీఆర్ విషయంలో జగన్ సానుకూలంగా వ్యహరించే తీరును జనాల్లో చూపిస్తూ సెంటిమెంట్ రగిల్చి ఓట్లు రాబట్టాలనే వ్యహంతో చంద్రాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనే తేలాలంటే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే