Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!

ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో  ఉంటాయి. మీరు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.  

Written by - Bhoomi | Last Updated : Jul 20, 2024, 04:32 PM IST
Income Tax Deductions:  ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!

ITR Alert: ప్రతి ఆర్థిక సంవత్సరం జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారలకు ముఖ్యమైన సమయం. ఆదాయపుపన్ను చట్టం ప్రకారం కాలపరిమితిలోపు మీ ఐటీఆర్ ఫైల్ చేయాలి. 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31. ఈ గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. అయితే సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ఐటీరిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని విషయాలను మర్చిపోతుంటారు. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ఫైల్ చేయడానికి చివరి నిమిషంలో..పన్ను మినహాయింపులలో కొన్నింటిని క్లెయిమ్ చేయడం కూడా మర్చిపోతారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే ముందు, ఈ డిడక్షన్స్  క్లెయిమ్ చేయడానికి అన్ని పత్రాలను తీసి దగ్గర పెట్టుకోవాలి. 

పీపీఎఫ్‎లో పెట్టుబడికి మినహాయింపు: 

సెక్షన్ 80C ప్రకారం, మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF),పన్ను ఆదా చేసే ఎఫ్ డీలు వంటి వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే..ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. 

EPFలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు:

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) పథకం కింద చాలా మంది జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఉన్నారు. ఈ పథకంలో, ఉద్యోగులు తమ జీతంలో 12% తప్పనిసరిగా వారి EPF ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగితోపాటు యాజమాన్యం కూడా కొంత వరకు యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మినహాయింపు క్లెయిమ్ చేయడానికి అర్హులు. 

Also Read : HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!

ELSS మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిపై రాయితీ :

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) ఈక్విటీలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్, మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కలిగి ఉంటాయి. మీరు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.అయితే,సెక్షన్ 80C కింద మినహాయింపుగా మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.  

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు:

మీరు 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, సెక్షన్ 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించినందుకు రూ. 25,000 వరకు మినహాయింపును పొందవచ్చు. తల్లిదండ్రుల వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మినహాయింపు మొత్తం రూ. 50,000 వరకు ఉంటుంది. FY 2015-16 నుండి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం రూ.5,000 అదనపు మినహాయింపు ఉండదు. 

Also Read : Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News