హైదరాబాద్: యావత్ దేశం ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ సభ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా అర్హులైన 90 కోట్ల మంది ఓటర్లలో నేడు 14 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 91 పార్లమెంటరీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 1279 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. నేటి నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్‌లలో మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగా ఇంకొన్ని చోట్ల మాక్ పోలింగ్ జరుగుతోంది.
పోటీచేస్తోన్న మొత్తం అభ్యర్థులలో 89 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళా అభ్యర్థులు 7 శాతం ఉన్నారన్నమాట.