Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఔట్..! ఏ టీమ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ ఉందంటే..?

Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంలో రోహిత్ శర్మ కోసం ఖర్చు చేసేందుకు టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
 

1 /8

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ 5 సార్లు ట్రోఫీని అందించాడు. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక తొలి ట్రోఫీని గెలిపించాడు. ఆ తరువాత 2015, 2017, 2019, 2020లో విజేతగా నిలిపాడు.

2 /8

ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుచుకుని నాలుగేళ్లు అయింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను తప్పించి.. కెప్టెన్సీ అప్పగించినా జట్టు తీరులో మార్పు రాలేదు.  

3 /8

ఈ సారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మను టీమ్ నుంచి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే ఐదు టీమ్‌లు పోటీ పడే అవకాశం ఉంది.   

4 /8

పంజాబ్ కింగ్స్ టీమ్ సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తోంది. 2024 సీజన్‌లో శిఖర్ ధావన్, సామ్ కరన్ కెప్టెన్సీ చేసినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. హిట్‌మ్యాన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.

5 /8

లక్నో సూపర్‌జెయింట్స్‌ జట్టును కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వైదొలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో లక్నో కూడా రోహిత్ శర్మను వేలంలో తీసుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు. 

6 /8

టైటిల్ కోసం సీజన్ ఆరంభం నుంచి ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా హిట్‌మ్యాన్ కోసం వేలంలో పోటి పడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే టీమ్‌లో ఉంటే ప్రత్యర్థులకు ఇక హడలే.  

7 /8

ఢిల్లీ క్యాపిటల్స్‌ను రిషభ్ పంత్ వీడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కోసం ఢిల్లీ టీమ్ ప్రయత్నించవచ్చు.  

8 /8

వేలంలోకి రోహిత్ శర్మ వస్తే కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికనబరిచే అవకాశం ఉంది.