Varalakshmi Vratham 2024: అష్టైశ్వర్యాలు..లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..ఈసారి వరలక్ష్మీ వ్రతం ఇలా చేద్దామా?

Varalakshmi Vratham Pooja: శ్రావణమాసంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసే వ్రతం...వరలక్ష్మీవ్రతం. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజులు పెళ్లయిన మహిళలు ఈ వ్రతం చేస్తారు. తన భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటుందని నమ్ముతుంటారు. మరి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఇంటిని, పూజగదిని, మండపాన్ని ఎలా అలంకరించాలో మనమూ తెలుసుకుందామా? 

1 /5

Varalakshmi Vratham Festivel: శ్రావణమాసంలో రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం వస్తుంది. ఆ రోజు వీలు కాలేదంటే..తర్వాత వచ్చే శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని చేయవచ్చు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా కొలుస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో శాంతి, సంపద, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. వరాలు కురిపించే ఆ చల్లని తల్లి ఆశీస్సులు మనపై కూడా ఉండాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ఇలా చేయాలి.   

2 /5

ఇలా  చేద్దామా పూజ? మీరు వరలక్ష్మీ వ్రతం చేయాలనుకుంటే..ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే పండగ రోజు ఇల్లు శుభ్రం చేయడానికి సమయం సరిపోదు.  ఇంట్లో గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు, పూలదండలు కట్టి..ఇంటి  చుట్టూ విద్యుత్ దీపాలతో లేదంటే నూనె దీపాలతో అలంకరించుకోవాలి. పూజకు ముందు ..అమ్మవారికి సంబంధించిన పాటలను పెట్టుకోవాలి. దీని వల్ల ఇల్లంత పండగ వాతావరణం, సందడి నెలకుంటుంది.   

3 /5

మండపాన్ని ఇలా అలంకరించాలి: ముందుగా మండపాన్ని శుభ్రంగా కడగాలి. వరిపిండి ముగ్గులు వేయాలి. నాలుగు వైపులు అరటి కొమ్మలు కట్టి మామిడాకులతో అలంకరించాలి. పూలదండలను కూడా మండపానికి కట్టాలి. తర్వాత మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన మండపాన్ని తూర్పు దిశకు అభిముఖంగా ఉంచాలి.   

4 /5

బంగారం లేదా, వెండి , రాగి  ఏ లోహంతో తయారు చేసిన కలశమైనా కావచ్చు..అలంకరించి  దాన్ని కొన్ని బియ్యం పోసి ఆకు లేదా పళ్లెంలో ఉంచాలి. కలశంలో ఉన్న బియ్యంలో నిమ్మకాయ, తమలపాకులు, నాణేలు ఉంచాలి. తర్వాత కలశం చుట్టూ మామిడాకులు పెట్టి పసుపు రాసిన కొబ్బరి కాయను ఉంచాలి. అమ్మవారి విగ్రహాన్ని లేదంటే ఫొటోను కూడా పెట్టొచ్చు. అమ్మవారిని ఎరుపు రంగు బ్లౌజ్ పీసు, ఆభరణాలు, పూలతో అలంకరించాలి. ఇప్పుడు దీపాలు వెలిగించాలి. అమ్మవారి ముందు నైవేద్యం పెట్టాలి. అనంతరం పూజ మొదలు పెట్టాలి.   

5 /5

పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులకు వాయనాలు ఇవ్వాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: వాయన దానం సమర్పయామి అనుకుంటూ నానబెట్టిన శగనగులు, మూడు ఆకులు, వక్క, అరటిపండు, పసుపు కుంకుమ, గంధం, పువ్వులు, ఎరుపు రంగు బ్లౌజ్ పీస్, పిండి వంటలు..వీటన్నింటిని ఒక పళ్లెంలో పెట్టి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి ఆశ్వీస్సులు ఎల్లప్పుడూ తోడుంటాయని నమ్ముతుంటారు. ఇలా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఆ ఇంట్లో సంతోషం నెలకుంటుంది.