Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కా


Business Ideas:  వ్యాపారంలో కొత్త ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా?  అయితే ఇప్పటివరకు ఎవరూ చేయని ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.  ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కొత్త రకం బిజినెస్ ద్వారా మీరు ప్రతి నెల కనీసం 50 వేల రూపాయలు సంపాదించుకున్న అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

Door step car cleaning service: వ్యాపారంలో రాణించేందుకు కేవలం ఐడియా ఉంటే సరిపోదు.పెట్టుబడి కూడా చాలా అవసరం అవుతుంది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు. వ్యాపారంలో అవకాశాలు కల్పించేందుకు ముద్రా రుణాలను ప్రవేశపెట్టింది. ముద్ర రుణం అప్లై చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. ముద్రా రుణం ద్వారా పొందిన ఋణంతో మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించవచ్చు.   

2 /6

ముద్రా రుణాలు మూడు  రూపాల్లో అందిస్తున్నారు. వీటిలో మొదటిది శిశు ముద్రా రుణాలు  ఇవి పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటాయి.  కిషోర్ ముద్ర రుణాలు ఇవి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉంటాయి. ఇక తరుణ్ ముద్రా రుణాలు ఇవి 10 లక్షల రూపాయల వరకు ఉంటాయి.  మీ వ్యాపార పరిమాణాన్ని బట్టి అవసరాన్ని బట్టి రుణం తీసుకుంటే సరిపోతుంది.   

3 /6

ఇప్పుడు మీరు అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఓ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ బిజినెస్ కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీ సిటీలో ఈ సర్వీస్ కనుక అందుబాటులో లేకపోతే వెంటనే ఈ బిజినెస్ మీరు ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.   

4 /6

డోర్ స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్ - ఇంటి వద్దనే కస్టమర్లకు కార్లను క్లీనింగ్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా కార్ క్లీనింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. దీనికోసం ప్రత్యేకంగా మీరు క్లీనింగ్ సెంటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.  అంతేకాదు ఈ క్లీనింగ్ కోసం వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి కూడా ఉంటుంది. 

5 /6

కొన్నిసార్లు క్లీనింగ్ కోసం డిమాండ్ పెరిగి గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ పరిస్థితినే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.  ప్రస్తుతం మార్కెట్లో పోర్టబుల్ కార్ క్లీనర్ మెషీన్లు లభిస్తున్నాయి. వీటి ధర 30 వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.  ఈ పోర్టబుల్ కార్ క్లీనింగ్ మిషన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ సర్వీసును ప్రారంభించవచ్చు.   

6 /6

డోర్ స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్ ను  ఇళ్ల వద్దనే నేరుగా కస్టమర్లకు కార్ క్లీనింగ్ సర్వీస్ అందించవచ్చు. ఇందుకోసం మీరు అవసరమైన  డబ్బులు చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరతో  సమానంగా కానీ తక్కువ కానీ మీరు ఈ సర్వీస్ అందించినట్లయితే. పెద్ద మొత్తంలో ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.  మీరు ఈ కార్ క్లీనింగ్ సర్వీసు ద్వారా రోజుకు కనీసం ఐదువేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.