Top 5 Bikes: సామాన్యుడు కొనలేని టాప్‌ 5 స్పోర్ట్స్‌ బైక్‌లు ఇవే! వాటి ఫీచర్లు, ధరలు

You Know Top 5 Sports Bikes Check Out List Here: స్పోర్ట్స్‌ బైక్‌లంటే యువతకే కాదు ప్రతి ఒక్కరికి అమితమైన ఇష్టం. ఆకర్షణీయంగా.. అద్భుతమైన ఫీచర్లతో కలిగిన ఈ బైక్‌లు అత్యంత వేగంతోపాటు ఎన్నో భద్రతా సౌకర్యాలు కలిగి ఉన్నాయి. స్పోర్ట్స్‌ బైక్‌ల్లో టాప్‌ 5 ఏమిటో తెలుసుకోండి.

1 /6

You Know Top 5 Sports Bikes Check Out: ఆకర్షణీయంగా.. అద్భుతమైన ఫీచర్లతో కలిగిన ఈ బైక్‌లు అత్యంత వేగంతోపాటు ఎన్నో భద్రతా సౌకర్యాలు కలిగి ఉన్నాయి. స్పోర్ట్స్‌ బైక్‌ల్లో టాప్‌ 5 ఏమిటో తెలుసుకోండి.

2 /6

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 650 Top 5 Sports Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలో మెటోర్‌ 650 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్‌ 650 అనేది 648 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే క్రూయిజర్ బైక్. 47 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్‌లో కాంటెంపరరీ డిజైన్, సూపర్ వైల్డ్ ఫీచర్లు ఉండడం విశేషం. ఈ బైక్‌ ధర రూ.3.78 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

3 /6

సుజుకి హయాబుసా Top 5 Sports Bikes: ఈ బైక్‌ 1340 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సూపర్ బైక్ ఇది. 190 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ అద్భుతమైన వేగం ఉంది. సూపర్ బైక్ డిజైన్ కలిగి ఉండడంతో వినియోగదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ బైక్ ధర రూ.15.1 లక్షల నుంచి ప్రారంభం.

4 /6

కవాసకి నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ Top 5 Sports Bikes: టాప్ బైక్‌లలో ఒకటి. ఇది సూపర్ స్పోర్ట్ బైక్. 998 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 200+ హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ అత్యధిక గరిష్ట వేగం కలిగి ఉంది. అద్భుతమైన పని తీరు కనబరుస్తుంది. ఈ బైక్ ధర రూ.14.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

5 /6

బీఎండబ్ల్యూ ఎస్‌1000ఆర్‌ Top 5 Sports Bikes: బీఎండబ్ల్యూ బైక్‌లలో ఎస్‌1000R అనే బైక్‌ను యువతను ఆకర్షిస్తోంది. ఈ బైక్‌ 999 సీసీ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే స్లిప్‌స్ట్రీట్ బైక్‌గా గుర్తింపు పొందింది. 165+ హెచ్‌పీ పవర్ కెపాసిటీతో ఉన్న ఈ బైక్ ఫుల్ ట్యూబ్ బ్రాంచ్ టెక్నాలజీతో రూపొందించారు. పెడికాబ్ ఔటర్ రేంజ్ టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ బైక్‌ ధర రూ.18.1 లక్షల నుంచి ప్రారంభం.

6 /6

డుకాటీ పనిజెలి వీ4 Top 5 Sports Bikes: ఈ బైక్‌ 1103సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే సూపర్ స్పోర్ట్ బైక్‌గా గుర్తింపు పొందింది. 214 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ బైక్ ప్రీమియం డిజైన్, డిటైలింగ్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ ధర రూ.24.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.