Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విచ్చల విడిగా పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహారాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను సులభంగానియంత్రించవచ్చు. ఈ క్రింది పానీయాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడతాయి:
అధికంగా నీటిని తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
బ్లాక్ టీ కూడా గ్రీన్‌టీ లాగానే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీరులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. ఇది ఒక సహజమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా కూడా చెప్పుకుంటారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
టమాటోలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పరిగణిస్తారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలతో పాటు రాస్ప్బెర్రీలు వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఓట్స్ మిల్క్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.