Malavika Mohanan: తెలుగు వారంటే ఇష్టం లేదా?..నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం..!

Malavika Mohanan: తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక నెటిజన్ మాళవికకు.. తమిళ వాళ్ళు అంటే మాత్రమే ఇష్టం.. తెలుగు వాళ్ళు అంటే..ఇష్టం లేదంటూ కామెంట్లు చేయగా.. దానికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఈ హీరోయిన్స్.

1 /5

 ప్రముఖ కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్.. గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులను తన అందచందాలతో, నటనతో విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే.. ఈమె తాజాగా నటించిన చిత్రం తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది.

2 /5

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ హీరోగా, నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్ పై  జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న సినిమా ఇది. పా.రంజిత్ దర్శకత్వం.. వహిస్తున్న ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్,పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల.. ముందుకు రానుంది. 

3 /5

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె.. నెటిజన్ లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే ఒక నెటిజన్ ‘మాళవికా.. తమిళ్ వాళ్లకు మాత్రమే రిప్లైలు ఇస్తుంది.. తెలుగు వాళ్ళను పట్టించుకోదు. అయినా సరే ఆమె నటించినా తంగలాన్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్ పెట్టాడు. 

4 /5

దీనికి మాళవిక రిప్లై ఇస్తూ.. ‘ఇది నిజం కాదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుగు ప్రేక్షకులు అంటే చాలా ఇష్టం. అందుకే నేను తెలుగులో కూడా ఇప్పుడు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాను. మీరు కూడా చాలా ప్రేమను నాకు ఇస్తూ ఉంటారు. అందుకే మిమ్మల్ని నేను మర్చిపోను’ అంటూ పోస్ట్ పెట్టింది మాళవిక. 

5 /5

ఇకపోతే మాళవిక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.