Banned Indian Foods: ఎంతో ఇష్టమైన ఈ ఫుడ్స్ ఆ దేశాల్లో తింటే శిక్ష తప్పదు, కారణాలేంటి

మన దేశంలో ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్ధాలను విదేశాల్లో అదే పనిగా తింటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..అవును మరి. ఆరోగ్య కారణాలతో కొన్ని భారతీయ ఆహార పదార్ధాలను కొన్ని దేశాలు నిషేధించాయి. ఏయే దేశాల్లో దేనిపై నిషేధం ఉందో తెలుసుకుందాం.

Banned Indian Foods: మన దేశంలో ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్ధాలను విదేశాల్లో అదే పనిగా తింటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..అవును మరి. ఆరోగ్య కారణాలతో కొన్ని భారతీయ ఆహార పదార్ధాలను కొన్ని దేశాలు నిషేధించాయి. ఏయే దేశాల్లో దేనిపై నిషేధం ఉందో తెలుసుకుందాం.

1 /6

పాన్  భారతదేశంలో అత్యంత ఇష్టంగా తినే పాన్ అమెరికా, కెనడా, యూకే దేశాలు నిషేధించాయి. పాన్, వక్క, అందులో కలిపే సున్నం ఇతర మసాలాలతో  సాంప్రదాయంగా వస్తున్న జీర్ణక్రియను మెరుగుపర్చే గుణాలు కలిగిన పాన్ దేశంలో చాలా ప్రసిద్ధి. కానీ ఆరోగ్య కారణాలతో ఈ దేశాలు పాన్పై నిషేధం విదించాయి. పాన్ నమలడం వల్ల కేన్సర్ వంటి పలు అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుుతంది. 

2 /6

బెల్లం అమెరికాలో నిషేధముంది. చెరకు నుంచి బెల్లం తయారీలో ఉండే సాంప్రదాయ పద్ధతుల్లో సేఫ్టీ, క్వాలిటీ లేని కారణంగా నిషేధించింది. బెల్లం ఉత్పత్తిలో హై జీనిక్ వాతావరణం లేకపోవడం మరో కారణం. 

3 /6

సింథెటిక్ రెడ్ ఫుడ్స్ యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేదించాయి. ఆరోగ్య సంబంధిత కారణాలతో భారతీయ స్వీట్స్, వంటకాల్లో ఉపయోగించే కొన్ని రకాల సింథెటిక్ రెడ్ పదార్ధాలపై నిషేధముంది. 

4 /6

సాంబార్ యూరోపియన్ యూనియన్ దేశాల్లో నిషేధం. వ్యవసాయ సంబంధిత కారణాలతో నిషేధించారు. వాస్తవానికి ఈ నిషేదం సాంబారుపై కాదు. సాంబారులో ఉపయోగించే వంకాయపై. కొన్ని రకాల వంకాయను యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధించాయి. 

5 /6

హ్యాగిస్ అమెరికాలో నిషేధం. హ్యాగిస్ అనేది ఓ రకమైన స్కాటిష్ వంటకం. భారతీయ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఈ సాంప్రదాయ వంటకంలో గొర్రె లంగ్స్ వాడుతారు. పశువుల లంగ్స్ దిగుమతిపై నిబంధనలు, నిషేధం కారణంగా 1971 నుంచి అమెరికాలో నిషేధించారు. 

6 /6

కిండర్ జాయ్ అమెరికా నిషేధించింది. ఆరోగ్య భద్రత కారణాలతో కిండర్ జాయ్ నిషేదితమైంది. వాస్తవానికి ఇది ఇండియాది కాకపోయినా ఈ దేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. గుడ్డు ఆకారపు వస్తువులోపల చాకోలేట్తో పాటు చిన్న చిన్న ఆట వస్తువులు ఉంటాయి. దాంతో సెక్యూరిటీ కారణంగా అమెరికా నిషేధించింది. వీటి వల్ల పిల్లలకు శ్వాస ఆడని పరిస్థితి రావచ్చని అనుమానం.