దక్షిణాది సిమినామాల్లో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ హీరోస్ సరసన నటించింది రకుల్ ప్రీత్ సింగ్. జస్ట్ సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకన్న ఈ ముద్దుగుమ్మ ఇటివలే గేర్ మార్చింది . ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకుంది.
ఏకంగా స్టార్ అజయ్ దేవ్ గన్ సరసన నటించి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ సినిమాలో 50 ఏళ్ళు పైబడిన వ్యక్తితో ప్రేమలో పడే అమ్మాయిగా నటించింది రకుల్ . ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ‘మన్మధుడు 2’లో ఏజ్డ్ బ్యాచిలర్ గా కనిపించబోతున్న నాగ్ సరసన నటించేందుకు సై అనేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే రీసెంట్ గా వెంకటేష్ చేయబోతున్న ‘దేదే ప్యార్ దే’ సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా తెలుగు రీమేక్ లో కూడా హీరో ఏజ్ 50 ప్లస్సే. రకుల్ విషయంలో ఇవి అనుకోకుండానే ఇది రిపీటెడ్ గా జరుగుతున్నాయట.
రకుల్ పక్కా ఇలాగే ప్లాన్ చేసుకుంది అని చెప్పలేం కానీ... ఈ రోల్ కి రకుల్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. హీరో క్యారెక్టర్ ని బట్టి కాస్త ఏజ్డ్ గా చూపించాలంటే న్యాచురల్ గానే హీరోయిన్ యంగ్ గా ఉండాలి. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ కి రకుల్ నే ప్రిఫర్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ ఏజ్‌తో పనేంటి ... కథ మంచిగుంటే చాలు అని ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పేందట