September Lucky Zodiac Signs 2024: సెప్టెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..

September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 22, 2024, 11:31 AM IST
September Lucky Zodiac Signs 2024: సెప్టెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..

 

September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. ఈ సంచార ప్రభావమే అన్ని గ్రహాలపై పడి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం పరంగా వచ్చే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ సమయంలో బుధ గ్రహంతో పాటు అదృష్ట గ్రహంగా పరిగణించే బృహస్పతి ఒకే రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా జాతకంలో బుధుడు కానీ బృహస్పతి కానీ బలంగా ఉన్న రాశుల వారు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు. అలాగే జీవితంలో వచ్చే సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 22న బుధుడు బృహస్పతి గ్రహం కలయిక జరగబోతోంది. మొదట కన్యా రాశిలో బుధుడు ఉదయం 10 గంటలకు సంచారం చేస్తాడు. ఇదిలా ఉంటే రాత్రి 7 గంటలకు మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి గ్రహం సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మేష రాశి: 
మేష రాశి వారికి ఈ గ్రహాల కలయిక ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా మతపరమైన పనులపై కూడా ఆసక్తి పెరుగుతుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి వృత్తి జీవితం గడుపుతున్న వారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. దీని కారణంగా డబ్బు అధికమవుతాదలో సంపాదిస్తారు. 

కన్యా రాశి:
సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారు కూడా మంచి ధన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులన్నీ ఎంతో తొందరగా పూర్తి అవుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాముల సపోర్టు లభించి భారీ మొత్తంలో ధన లాభాలు పొందుతారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మంచి పట్టును సాధిస్తారు. ఇక భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారికి భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు కూడా పరిష్కారం అవుతాయి. 

మకర రాశి:
మకర రాశి వారికి కూడా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారాల్లో వస్తున్న చిక్కులు మొత్తం పరిష్కారమవుతాయి. దీంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే తెగిపోయిన కుటుంబ సంబంధాలు కూడా ఈ సమయంలో బ్యాచ్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఎంతో ఆనందంగా గడిపేందుకు అద్భుతమైన సమయాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం రెట్టింపు లాభాలను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News