Team India Captains: టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ వివిధ సమయాల్లో వేర్వేరు క్రికెటర్లు సారధ్యం వహించారు. ఎంకే పటౌడీ నుంచి రోహిత్ శర్మ వరకూ అందరూ అటు సక్సెస్ ఇటు ఫెయిల్యూర్ రెండూ చవి చూసినవాళ్లే. అలాంటి టాప్ 10 కెప్టెన్ల గురించి తెలుసుకుందాం. ఎవరి హయాంలో టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఓడిందో పరిశీలిద్దాం
ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లలో టీమ్ ఇండియాకు కెప్టెన్సీ వహించాడు. 2007 నుంచి 2018 వరకు ఎంఎస్ ధోని మొత్తం 332 మ్యాచ్‌లకు సారధ్యం వహించగా అందులో 120 మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.
టాప్ 10 ఇండియన్ కెప్టెన్లు టీమ్ ఇండియా ఎవరి కెప్టెన్సీలో ఎక్కువ ఓటములు లభించాయో తెలుసుకుందాం. ఈ జాబితాలో ఎంకే పటౌడీ, కపిల్ దేవ్ నుంచి రోహిత్ శర్మ వరకూ అందరూ ఉన్నారు. ఎవరెన్ని మ్యాచ్‌లు సారద్యం వహించి ఎన్నింటిలో ఓడిపోయారో తెలుసుకుందాం
మొహమ్మద్ అజారుద్దీన్ మొహమ్మద్ అజారుద్దీన్ 1990 నుంచి 1999 వరకూ 221 మ్యాచ్‌లలో టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇందులో 90 మ్యాచ్‌లలో ఇండియా ఓడిపోయింది.
సౌరవ్ గంగూలీ సౌరవ్ గంగూలీ 1999 నుంచి 2005 వరకూ టీమ్ ఇండియా కెప్టెన్. 195 మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు. ఇందులో 78 ఓటములు లభించాయి.
విరాట్ కోహ్లి విరాట్ కోహ్లి 2013 నుంచి 2022 వరకు టీమ్ ఇండియాకు 213 మ్యాచ్‌లలో సారధ్యం వహించాడు. ఇందులో 60 మ్యాచ్‌లలో ఓడిపోయాడు.
సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ స్వల్పకాలమే ఇండియా కెప్టెన్ బాద్యతలు వహించాడు. 1996 నుంచి 2000 వరకూ 98 మ్యాచ్‌లకు కెప్టెన్. ఇందులో 52 ఓడిపోయాడు
సునీల్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ 1976 నుంచి 1985 వరకు 84 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాకు సారద్యం వహించాడు. ఇందులో 29 మ్యాచ్‌లు ఇండియా ఓడిపోయింది.
రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ 2000 నుంచి 2007 వరకూ టీమ్ ఇండియాకు 104 మ్యాచ్‌లలో సారద్యం వహించాడు. వీటిలో టీమ్ ఇండియా 39 మ్యాచ్‌లలో ఓడిపోయింది
రోహిత్ శర్మ రోహిత్ శర్మ టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్. 126 మ్యాచ్‌లలో ఇండియాకు సారద్యం వహించాడు. కేవలం 28 మ్యాచ్‌లే ఓడిపోయాడు.
ఎంకే పటౌడి టీమ్ ఇండియాకు 1962 నుంచి 1975 వరకూ 40 మ్యాచ్‌లలో సారధ్యం వహించాడు. 19 మ్యాచ్‌లలో ఇండియా ఓడిపోయింది