బడ్జెట్ దెబ్బకు షేర్ మార్కెట్లు కుదేల్ !!

Last Updated : Jul 5, 2019, 06:53 PM IST
బడ్జెట్ దెబ్బకు షేర్ మార్కెట్లు కుదేల్ !!

షేర్ మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం గట్టిగానే చూపింది. ఉదయం భారీ లాభాల్లో మొదలైన మార్కెట్లు ఒక దశలో సెన్సెక్స్‌ 40,032 వద్దకు చేరింది..అయితే  బడ్జెట్‌ అనంతరం మదుపరులు భారీగా అమ్మకాలకు దిగారు.  దీంతో   స్టాక్ మార్కెట్ నష్టాల వైపు పయనించింది. 

ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం 1.30 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్లు నష్టపోయి 39,459 వద్ద కొనసాగింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 11,802 దగ్గర ట్రేడ్‌ అయింది.

ఇలా పతనపమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 394 పాయింట్లు నష్టపోయి 39,513 వద్దకు, నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 11,811కు చేరింది.

Trending News