Ketu-Surya: కన్యా రాశిలో కేతువు, సూర్యుడు కలయిక.. ఈ రాశులవారికి ధన యోగం!

Ketu and Surya Combination in Virgo: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించబోతోంది. దీనికి కారణంగా ఇప్పటికే కేతు గ్రహం కన్యా రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 31, 2024, 11:13 AM IST
Ketu-Surya: కన్యా రాశిలో కేతువు, సూర్యుడు కలయిక.. ఈ రాశులవారికి ధన యోగం!

Ketu and Surya Combination in Virgo: సెప్టెంబర్ నెల రాశి సంచారాలపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.. ఎందుకంటే ఈ నెలలోనే గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు కూడా రాశి సంచారం చేయబోతున్నాడు. ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణించే సూర్యుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. అయితే ఈ గ్రహం అతి త్వరలోనే కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కన్యారాశిలో కేతు గ్రహం సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహం దాదాపు 2025 సంవత్సరం వరకు అదే రాశిలో సంచార దశలో ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కన్యా రాశికి అధిపతిగా బుధుడు వ్యవహరిస్తాడు అయితే సూర్యుడు సంచారం చేయడం కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా సంక్రాంతిగా పిలుస్తారు. 

సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కన్యా సంక్రాంతి రోజున కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ఆ శుభప్రదంగా ఉంటుంది. అలాగే కన్యారాశిలో కేతు గ్రహం కూడా సంచార దశలో ఉంది కాబట్టి ఈ రెండు గ్రహ కలయికలు జరుగుతాయి దీని కారణంగా కేతువు గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి విపరీతమైన లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్నవారికి ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహం సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఏర్పడే ప్రభావంతో కొన్ని రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందగలుగుతారు అలాగే కోరుకున్న కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి. కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా ముఖ్యంగా ఓ రెండు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే వారికి ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి సంచారం కారణంగా మేష రాశి వారికి వృషభరాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

ఈ రెండు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి, ముఖ్యంగా వీరికి అదృష్టం పెరగడమే కాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా సింహ మిధున కర్కాటక రాశి వారికి కూడా సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ రాశుల వారికి కూడా అనుకున్న పనులు వెంటవెంటనే జరుగుతాయి అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మకర రాశి వారికి విశ్వాసం పెరిగి అనుకున్న లాభాలు పొందగలుగుతారు. దీంతోపాటు జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ రాశి వారికి కోరుకున్న కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News