Pawan Kalyan Remunaration: పవన్ కళ్యాణ్ సహా తెలుగు టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. !

Pawan Kalyan Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ పరిశ్రమలో లేనట్టు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలున్నారు.  ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన టాలీవుడ్  హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో పవన్ కళ్యాణ్ నుంచి ఏయే హీరో ఒక్క సినిమాకు ఎంత రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో ఓ లుక్కేద్దాం..

1 /6

పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్  పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు స్వయంగా వెల్లడించారు.

2 /6

 ప్రభాస్.. (Prabhas) బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ భారత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ మన తెలుగులో కాదు.. మన దేశంలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డులకు ఎక్కారు.  తీసుకుంటున్నట్టు సమాచారం.

3 /6

మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ. 140 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

4 /6

ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ భారత్  లెవల్‌కి పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 40 కోట్ల పారితోషకం తీసుకుంటున్న నటుడు ఎన్టీఆర్. దేవరతో పాటు హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

5 /6

రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా సత్తా చూపెట్టాడు. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ. 60 కోట్ల వరకు రెమ్యునరేషన్  తీసుకుంటున్నట్టు సమాచారం.

6 /6

అల్లు అర్జున్.. అల్లు అర్జున్.. ప్రస్తుతం ఒక్కో చిత్రం కోసం రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇపుడు పుష్ప 2 తర్వాత తన పారితోషకం పెంచే అవకాశాలున్నాయి.