తిరుమలలో నూతన సాంప్రదాయానికి శ్రీకారం.. సామాన్యుల కోసం వీఐపీలకు బ్రేక్ !!

భక్తుల దర్శనాల విషయంలో టీడీపీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది

Last Updated : Jul 16, 2019, 12:49 PM IST
తిరుమలలో నూతన సాంప్రదాయానికి శ్రీకారం.. సామాన్యుల కోసం వీఐపీలకు బ్రేక్ !!

నిరంతరం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి దేవ స్థానంలో ప్రక్షాళన జరగబోంది. దర్శన ప్రక్రియలో పాత విధానానికి స్వస్తి పలుకుతూ నూతన సాంప్రదాయం దిశగా అడుగులు పడుతున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బందులను కలగకుండా ఉండేందుకు టీడీపీ చర్యలకు సన్నద్ధమౌతోంది. సామాన్యుల కోసం వీవీఐపీలకు దర్శకనాలకు బ్రేక్ పడబోంది . తిరుమలలో L1,L2,L3 బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని అధికారులకు టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

తాజా నిర్ణయంతో ఇక నుంచి వీవీఐపీలో రోజూ శ్రీవారిని దర్శించుకనే అవకాశం ఉండబోదు. ప్రోటోకాల్, సాధారాణ వీఐపీ దర్శనాలే ఉంటాయి. ఇదే సమయంలో వీవీఐపీల దర్శనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు టీడీపీ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తిరుమలలో టీడీడీ ఛైర్మన్ కు శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతిలోనూ టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్బంగా టీడీడీ ఛైర్మన్ వైసీపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు సకాలంలో దర్శన భాగ్యం కల్గించడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో వీవీఐపీ దర్శనాలకు బ్రేక్ వేయాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి దర్శనాకినికి వచ్చే వీవీఐపీలు ఏడాదికి ఒక్కసారి వస్తేనే బాగుంటుందని సూచించారు. దర్శన భాగ్యం విషయంలో భక్తులు కోర్టులకు వెళ్లే పరిస్థితులు భవిష్యత్తులో రానివ్వమని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైసీపీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీడీపీ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Trending News