Snake Facts: గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటేయ్యవు.. కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Snake Facts For Pregnant Woman: హిందూ సాంప్రదాయం ప్రకారం, పాముకి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. పామును నాగదేవతగా చెప్పుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం నాగుల పంచవి రోజు నాగ దేవతగా పామును పూజించడం ఆనవాయిగా వస్తోంది. పురాణాల ప్రకారం పాముల గురించి అనేక విషయాలను శాస్త్రంలో తెలిపారు. అందులో ఒకటి.. గర్భిణీ స్త్రీలను పాములు కాటేయవట.. దీని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో క్లుప్తంగా వివరించారు.
 

1 /6

బ్రహ్మవైవర్త పురాణంలో పాముల గురించి వివిధ కథలు ఉన్నాయి. అందులో ఒకటి గర్భవతి పాముకు సంబంధించింది. ఈ కథకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కథ గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

2 /6

పురాణాల ప్రకారం, ఒక పాత శివాలయంలో  గర్భవతి ఎంతో భక్తితో తపస్సు చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఓ పెద్ద నాగుపాము వచ్చి తపస్సు చేస్తుంది. ఆమెను చూసి పాము తెగ ఆశ్చర్యపోతూ ఉంటుంది.

3 /6

ఇలా తపస్సు చేస్తున్న గర్భిణిని చూసి ఎందుకు ఆమె తపస్సును ఎందుకు భగ్నం చేయాలని అనుకుంటుంది. అయితే ఈ పాము గర్భిణిని శివుడిగా భావించి ఆమె చుట్టూ తిరిగుతూ ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేస్తుంది.   

4 /6

ఇలా పాము ఆమె చుట్టూ తిరుగుతూ చప్పుడ చేస్తూ తపస్సుకు భంగం కలిగిస్తుంది. అంతేకాకుండా చూస్తూ ఉండడానే మహిళ దుస్తువుల్లోకి పాము వెళ్తుంది. అయితే ఇలా పాము చేస్తున్న ప్రవర్తనకు కడుపులో పెరుగుతున్న శిశువుకు కోపం వచ్చి పామును శపిస్తుంది.   

5 /6

శపించినప్పటి నుంచి గర్భిణి స్త్రీల దగ్గరుకు పాము వస్తే.. ఎలాంటి పామైనా కంటి చూపు కోల్పోతోందని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయని శాస్త్రంతో తెలిపారు. 

6 /6

శాస్త్రీయ కారణాల ప్రకారం, స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆమె శరీరంలో జరిగే హార్మోన్ల కారణంగా వాసనలు పసిగట్టి పాములు దగ్గరకు రావట. అలాగే దగ్గర వచ్చిన కాటేసే అవకాశాలు కూడా ఉండవని నిపుణులు తెపుతున్నారు.