Shukraditya Raja Yogam: త్వరలో కన్యారాశిలో శుక్రాదిత్య రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికీ వద్దన్న డబ్బే..

Shukraditya Raja Yogam: వచ్చే యేడాది  కన్యా రాశిలో గ్రహాల రాజు అయిన రవి, విలాస కారకుడైన శుక్రుడు కలవడం శుభ పరిణామంగా పరిగణిస్తారు. రవి, శుక్రలు కన్య రాశిలో కలిసి ఏర్పరిచే యోగాన్ని శుక్రాదిత్య రాజయోగంగా అభివర్ణిస్తారు. ఈ యోగంతో ఈ మూడు రాశుల జీవితంలో మంచి  జరగబోతడంతో పాటు వద్దన్న డబ్బు చేతికి అందుతుంది.

1 /5

Shukraditya Raja Yogam:  జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలాంటి యోగాల్లో శుక్రుడు, రవి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మరో యేడాది తర్వాత కన్యరాశిలో ఏర్పడబోతుంది.

2 /5

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికీ శుక్రాదిత్య రాజయోగం వల్ల కుటుంబంలో గత కొన్నేళ్లుగా నెలకున్న విభేదాలు తొలిగిపోతాయి. చేస్తున్న వృత్తిలో వృద్ధి ఉంటుంది. అనుకోని డబ్బు చేతికి అందుతుంది.

3 /5

వృశ్చిక రాశి.. శుక్రాదిత్య రాజయోగం వల్ల వృశ్చిక రాశి అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలవుతాయి. చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా వృత్తి జీవితంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

4 /5

మకర రాశి.. మకర రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల చేసే వృత్తిలో విజయం వరిస్తుంది. వ్యాపారంల కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితులు కుదుటపడుతాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది.  

5 /5

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.