భారత ప్రభుత్వం దౌత్యపరంగా మరో విషయం సాధించింది. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణాసియా దేశాలు సమర్ధించారు. ఈ అంశంపై పాక్ వితండ వాదనను ఆయా దేశాలు తప్పుబట్టాయి. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది. మాల్దీవుల్లో జరుగుతున్న దక్షిణాయా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ భేటీలో ఈ మేరకు తీర్మానించారు.
అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించతలపెట్టిన పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. దీంతో పాక్ తో పాటు చైనాకు గట్టి షాక్ తగలినట్లయిది. ఇదిలా ఉంటే భారత్ ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు.