Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..

Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

1 /6

పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. అందులో రాజకీయం అనే పడవలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాడు.

2 /6

ఈ నేపథ్యంలో పవన్ చేతిలో  ఉన్న ప్రాజెక్ట్స్ డైలామాలో పడ్డాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ కోవలో నెలలో కొన్ని రోజులు సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

3 /6

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చాలా కాలం తర్వాత సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు. ఎపుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ‘హరి హర వీర మల్లు' సినిమా  షూటింగ్ ను పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

4 /6

ముందుగా ఈ సినిమా కంప్లీటైన తర్వాత ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.  ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘హరి హర వీరమల్లు పార్ట్ -1’ సోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

5 /6

ముందుగా ఈ సినిమాను ఈ యేడాదే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా  ఈ చిత్రం వచ్చే యేడాది మార్చి 28కి పోస్ట్ పోన్ చేయడంతో అభిమానులు నిరుత్సాహా పడుతున్నారు. ఇప్పటికే ‘ఓజీ’ సినిమా ఈ నెల 27కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఆ సినిమా వాయిదా పడటంతో ఆ ప్లేస్ లో ‘దేవర’ వస్తున్నాడు.  

6 /6

మరి తాజాగా  ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తేది వాయిదా పడటం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది. మరి ఈ సారైనా ‘హరి హర వీరమల్లు’ సినిమా చెప్పిన డేట్ కు థియేటర్స్ లో విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.