అమరావతి ప్రాజెక్టు రివ్యూ పై సింగపూర్ రియాక్షన్ ఇదే...!!

అమరావతి ప్రాజెక్టు సమీక్ష నిర్వహించాలన్న ఏపీ సర్కార్ ఆలోచనపై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది

Last Updated : Sep 9, 2019, 02:09 PM IST
అమరావతి ప్రాజెక్టు రివ్యూ పై సింగపూర్ రియాక్షన్ ఇదే...!!

రాజధాని అమరావతిపై ఏపీ సర్కార్ సమీక్షించాలన్న ఆలోచనపై  సింగపూర్ ప్రభుత్వం స్పందించారు. సింగపూర్ లోని ఓ సదస్సులో  ఆ దేశ ఆర్ధిక మంత్రి బాలకృష్ణన్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును రివ్యూ చేయాలనుకుంటోందని...ఈ విషయం తనకు సింగపూర్ కన్సారియ తనకు తెలిపిందన్నారు. 

ప్రాజెక్టులపై సమీక్షించుకనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని బాలకృష్ణన్ ... ఏపీ ప్రభుత్వం నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సమీక్ష ప్రభావాన్ని కూడా అంచనా వేస్తున్నామని తెలిపారు

రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన విషయం తెలిసిందే.  చంద్రబాబు హయంలో నగర నిర్మాణానికి  సంబంధించిన పలు ప్రాజెక్టులపై ఏపీ సర్కార్-సింగపూర్ ప్రభుత్వం పై పలు ఒప్పందాలు జరిగాయి. జగన్ సర్కార్ దీనిపై సమీక్ష నిర్వహించాలనుటోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఆలోచన పై సింగపూర్ ఆర్ధిక మంత్రి ఈ మేరకు స్పందించారు.

Trending News