Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

Highest-paid villains:సైఫ్ అలీ ఖాన్,  బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ చాలా మందే ఉన్నారు. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి సహా చాలా మందే ఉన్నారు.

1 /10

మన దేశంలో ప్రతి నాయకుల (విలన్) పాత్రల కోసం  ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో కమ్ నటుల్లో సైఫ్ అలీ ఖాన్, బాబీ దేవోల్ సహా పలువురు నటులున్నారు.

2 /10

సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ కోసం రూ. 15 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

3 /10

బాబీ దేవోల్.. ‘యానిమల్’ తర్వాత బాలయ్య హీరోగా నటిస్తూన్న 109 సినిమా కోసం బాబీ దేవోల్ దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. అటు ‘హరి హర వీరమల్లు’, కంగువా సినిమాల కోసం దాదాపు రూ. 12 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.  

4 /10

కమల్ హాసన్.. ‘కల్కి 2898 AD’ సినిమా కోసం  కమల్ హాసన్ దాదాపు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

5 /10

విజయ్ సేతుపతి.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ కోసం విజయ్ సేతుపతి దాదాపు రూ. 21 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

6 /10

ఫహద్ ఫాజిల్.. పుష్ప 2 మూవీ కోసం ఫహద్ ఫాజిల్ దాదాపు రూ. 8 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

7 /10

సంజయ్ దత్.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ కేజీఎఫ్ 2తో పాటు రీసెంట్ గా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.  

8 /10

నవాజుద్ధీన్ సిద్ధిఖి... ‘సైంధవ్’ సినిమా కోసం నవాజుద్దీన్ సిద్ధికి దాదాపు రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

9 /10

ఎస్.జే.సూర్య.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం దాదాపు రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

10 /10

ఇమ్రాన్ హష్మీ.. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ కోసం రూ. 8 కోట్లు ఛార్జ్ చేసినట్టు సమాచారం. అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న ‘ఓజీ’ మూవీ కోసం దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం.