Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..

Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక  ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.

1 /7

అశ్వయుజ మాసంలో దేవీనవరాత్రులను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమమంలో అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. అయితే.. దుర్గాదేవీ ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి గొప్ప యోగాలు సిధ్దించనున్నాయి. 

2 /7

కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ సారి నవరాత్రులలో గొప్పయోగాలు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం పన్నెండు రాశులపై కూడా ఉంటుంది. అందు వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం అత్యంత అనుకూలమైన ప్రభావం కల్గుతుంది.నవరాత్రులలో చాలా మంది అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటారు. 

3 /7

తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకమైన అలంకారాలు, తొమ్మిది నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. చెడుపై మంచి గెలిచిన దానికి గుర్తుగా మనం దసరాను జరుపుకుంటాం. ఇదే రోజున రావణుడ్ని రాముడు సంహారించాడని చెబుతుంటారు. ఈ  క్రమంలో అక్టోబరు 3 నుంచి కొన్ని రాశుల జీవితం మారిపోనుంది.

4 /7

మేష రాశి.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కల్గనుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలన్ని దూరమౌతాయి. మీ జీవితంలో అనుకొని విధంగా డబ్బులు వచ్చిపడతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి.

5 /7

మిథునం..ఈ రాశివారికి నవరాత్రియోగం వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. తండ్రివైపు నుంచి వివాదంలో ఉన్న ఆస్తులు మీ సొంతమౌతాయి. కోర్టుకేసులలో విజయాలు సాధిస్తారు. మీ బంధువలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు.

6 /7

ధనస్సురాశి.. ఈ రాశి వారికి ఈ నవరాత్రులలో లాటరీలు తగిలే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది. మీరు ఎన్నోరోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం కల ఇప్పుడు నెరవేర బోతుంది. మీ వల్ల లాభం పొందిన వారు మీకు అండగా ఉంటారు.  

7 /7

తులరాశి..ఈ రాశి వారికి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి అఖండ ధనలాభంను తెచ్చిపెడుతుంది. మీరు ఇన్నాళ్లు పడిన కష్టం అంతా .. మీకు డబ్బుల రూపంలో వస్తుందని చెప్పుకొవచ్చు. కొత్త  ఇళ్లను కొనుగోలు చేస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)