Janhvi Kapoor: ‘దేవర’తో జాన్వీ కపూర్ కు ఏమైనా ఒరిగిందా..!

Jahnvi Kapoor: జాన్వీ కపూర్..ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘దేవర’ మూవీతో  ఏమైనా ఒరిగిందా.. అంటే లేదనే చెప్పాలి. కేవలం రెండు మూడు సీన్లతో పాటు ఓ పాటలో మాత్రమే కనిపించింది. దీంతో ప్యాన్ ఇండియా స్టార్ కావాలనుకున్న జాన్వీ కల కల్లగానే మిగిలిపోయింది.

1 /6

ప్రస్తుతం అందరు ‘దేవర’ సినిమా గురించే చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో ‘దేవర’గా.. ‘వరద’గా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. అటు బైరాగా నటించిన సైఫ్  అలీ ఖాన్ కు ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. కానీ తంగం గా నటించిన జాన్వీకి పెద్దగా ఒరిగిందేమి లేదు.  

2 /6

పైగా జాన్వీ ఫస్ట్ సీన్ లోనే ఆమె జలక్రీడలు ఆడుతున్న సీన్ తో పాటు ఎన్టీఆర్ అంటే ప్రేమ కాదు. కామం అనే రీతిలో సాగింది. ముందుగా ఈ చిత్రంలో రెండు పాటలను అనుకున్నారు. కానీ ఒక్క పాటకే పరిమితమైంది.

3 /6

కేవలం జాన్వీ అంగాంగ ప్రదర్శనకే ఈ పాట అన్నట్టుగా సాగింది. కేవలం గ్లామర్ .. నార్త్ మార్కెట్ కోసం చేసిన ఈ ప్రయత్నం పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. పైగా ఉత్తరాదిలో ఎన్టీఆర్ పేరుతోనే ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

4 /6

‘దేవర’ మొదటి పార్ట్ లో ఈమె క్యారెక్టర్ ను పూర్తిగా లేదు. రెండో పార్టులో జాన్వీ కపూర్ చెలరేగిపోతుందేమో చూడాలి. మొత్తంగా శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ తప్పించి పెద్దగా మెప్పించలేదనే టాక్ వినిపించింది.

5 /6

ఏది ఏమైనా ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ కు కూడా మంచి హిట్ దక్కిందనే చెప్పాలి. ఈమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఓ రకంగా సినిమాలో జాన్వీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెడుతూనే మంచి హిట్ అందుకున్న భామగా అందరు గోల్డెన్ లెగ్ గా పిలవడం మొదలు పెట్టారు.

6 /6

మరి రాబోయే రామ్ చరణ్ సినిమాతో కూడా అదే ఊపును జాన్వీ కపూర్  కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.