Railway Reservations: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేల్లో ఒకటి. రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు కరెంట్ రిజర్వేషన్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడు ఆప్షన్లు చివరి నిమిషలో ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటాయి. అసలు ఈ మూడింటికీ తేడా ఏంటి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
ప్రీమియం తత్కాల్ టికెట్ తీసుకుంటే కన్ఫర్మేషన్ అవకాశాలు ఎక్కువ. ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది.
ప్రీమియం టికెట్ కూడా ముందు రోజు 10 గంటలకు ఉంటుంది. టికెట్ మాత్రం తత్కాల్ టికెట్ కంటే ఎక్కువ ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ టికెట్ అనేది ఇంకా ఎక్కువ ధర ఉంటుంది. ఇందులో టికెట్ సాధ్యమైనంతవరకూ దొరకవచ్చు.
తత్కాల్ టికెట్ ముందు రోజు 10 గంటలకు నాన్ ఏసీ బుకింగ్, 11 గంటలకు ఏసీ బుకింగ్ ప్రారంభమౌతుంది.
తత్కాల్ టికెట్ అనేది ప్రయాణానికి ఒక రోజు ముందు మొదలవుతుంది. సాధారణ టికెట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది.
చివరి నిమిషంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇదే బెస్ట్ ఆప్షన్. అయితే కరెంట్ రిజర్వేషన్ లభిస్తుందా లేదా అనేది సందేహమే
కరెంట్ రిజర్వేషన్ అనేది ప్రయాణం చేసే రోజే వర్తిస్తుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు కరెంట్ రిజర్వేషన్ మొదలవుతుంది
ఇటీవలి కాలంలో అంతా ఆన్లైన్ టికెటింగ్ నడుస్తోంది. ఇది అత్యంత సులభమైంది. సౌకర్యవంతమైంది.
దేశవ్యాప్తంగా రైల్వే ద్వారా లక్షలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ ద్వారా ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు.