Mars Transit 2024: ఈ 4 రాశులకు అక్టోబర్ 20 నుంచి డబ్బే డబ్బు, ఏం కోరుకుంటే అది

Mars Transit 2024: హిందూ జ్యోతిష్యం  ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా పిలుస్తారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా, సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతి అంటారు. అందుకే గ్రహాల గోచారంలో మంగళ గ్రహం గోచారం కీలకమైంది. ఇతర రాశుల్ని ప్రభావితం చేస్తుంది. 

Mars Transit 2024: మంగళ గ్రహాన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. ఇప్పుడీ గ్రహం త్వరలో మకర రాశిలో ప్రవేశించనుంది. అక్టోబర్ 20వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు మంగళ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో అప్పటి నుంచి 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయని చెప్పవచ్చు. ఈ నాలుగు రాశులవారికి అక్టోబర్ 20 నుంచి పట్టిందంతా బంగారం కానుంది. ఆ నాలుగు అదృష్ట రాశులేవో చూద్దాం..

1 /5

గ్రహాల్లో మంగళ గ్రహం అత్యంత కీలకమైంది. శుభ్రపదమైంది. అందుకే మంగళ గ్రహం గోచారం ప్రతి ఒక్కరి జాతకంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అందుకే అక్టోబర్ 20 నుంచి మంగళ గ్రహం మకర రాశిలో ప్రవేశించడంతో నాలుగు రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. జీవితం ఒక్కసారిగా మారిపోనుంది. 

2 /5

వృషభ రాశి మంగళ గ్రహం గోచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. జీవితం ఒక్కసారిగా మారిపోనుంది. అడుగడుగునా అదృష్టం తోడవడంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతమౌతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

3 /5

వృశ్చిక రాశి మంగళ గ్రహం గోచారంతో  వృశ్చిక రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. నిలిచినపోయిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా కలిసొస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి. 

4 /5

మకర రాశి అక్టోబర్ 20 నుంచి మంగళ గ్రహం ఈ రాశిలో ప్రవేశించనుంది. అందుకే ఈ రాశి జాతకులకు అందరికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రాశి జాతకులకు గోల్డెన్ డేస్ మొదలవుతాయి. అంటే కనకవర్షం కురవనుంది. ఊహించని సంపద వచ్చి పడుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి రిటర్న్స్ లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. 

5 /5

కర్కాటక రాశి మంగళ గ్రహం మకర రాశిలోనే ప్రవేశించనుంది. ఫలితంగా కర్కాటక రాశి జాతకులకు అక్టోబర్ 20 నుంచి మొత్తం దశ తిరిగిపోనుంది. ఎక్కడికి వెళ్లినా నీరాజనాలు పలుకుతారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. పిల్లల చదువు బాగుంటుంది. అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.