Bastar Dussehra: బస్తర్‌ దసరా గురించి తెలుసా? 800 ఏళ్లనాటి కాకతీయ సంప్రదాయపు వేడుక..!

Bastar Dussehra celebrations: దేశమంతటా శరన్నవరాత్రులు దసరా ముందు జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆయుధ పూజ, దుర్గాపూజ, ఆ మరుసటి రోజు విజయదశమి జరుపుకుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మాసంలో దసరా పండుగ వస్తుంది. అయితే, మీరు ఎప్పుడైనా బస్తర్‌ దసరా పండుగా గురించి విన్నారా? ఇక్కడ 3 నెలలపాట దసరా వేడుకలు జరుపుకుంటారు.
 

1 /7

సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను పెత్తర అమావాస్య మరుసటి రోజు నుంచి 9 రోజులపాటు నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో అయితే, బతుకమ్మ పండుగను కూడా నిర్వహిస్తారు. మొత్తానికి నవరాత్రి ఉత్సవాలు మాత్రం 9 రోజులపాటు నిర్వహిస్తారు.  

2 /7

దసరా పండుగ అనగానే గుర్తుకు వచ్చేది మైసూర్‌. ఇక్కడకు లక్షల సంఖ్యంలో జనాలు గుమిగూడి దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ, బస్తర్‌లో మూడు నెలల పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటారు.  

3 /7

ఇక్కడి దసరా పండుగ ఉత్సవాల్లో గిరిజనుల నృత్యం ఎంతో ప్రత్యేకం. ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా బస్తర్‌లో దంతేశ్వరీ ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.  

4 /7

ఇక్కడి రథోత్సవం కూడా ప్రత్యేకం. ఛత్తీస్‌ఘడ్‌లో ఉండే బస్తర్‌లో ఎక్కువ శాతం మంది తెగవారు నివసిస్తారు. బస్తర్‌ ఉత్సవాల సమయంలో అందరూ ఒక్క చోటికి చేరి కన్నులపండువగా ఉత్సవాలు జరుపుకొంటారు.  

5 /7

కాకతీయుల కాలంనాడు ఈ బస్తర్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని నమ్మకం ఉంది. అన్నమదేవుడు, పురషోత్తమదేవుడు ఈ సంబరాలను ప్రారంభించారు. పటజాత్రతో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఢిల్లీ సుల్తానులు అన్నమదేవున్ని బలవంతంగా తీసుకువెళ్తున్న సమయంలో తప్పించుకుని ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేశారు. అందుకే వీరిని కాకతీయల వంవీయులు అని కూడా పిలుస్తారు.  

6 /7

మరోకథనం ప్రకారం పురాతన కాలంలో శ్రీరాముడు వనవాసానికి తమ ప్రాంతానికే వచ్చి అరణ్యవాసం చేశారని ఇక్కడి వారు చెబుతుంటారు. రాములోరు ఇక్కడే 14 ఏళ్లు వనవాసం చేశారని కూడా నమ్ముతారు.  

7 /7

ఈ దండకారణ్యంలో ఆదివాసీలు దంతేశ్వరీ మాతను పూజిస్తారు. ఇక్కడి ఆడవాళ్లు అమ్మవారికి  ఇష్టమైన ఎరుపు రంగు చీరలు ధరించి తమ సంప్రదాయపు నృత్యాలు చేస్తారు. ఒకవిధంగా ఇది గర్భా డ్యాన్స్‌ వంటిదే. దర్బార్‌ తో దసరా వేడుకలు ముగుస్తాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)