Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దసరా పండుగ ముందు రైతులకు భారీ స్వంతన కలుగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇటీవల కురిసిన భారీవర్షాలకు రైతులు పంట నష్టం వల్ల వారి ఆదాయాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రేవంత్ సర్కార్ వారికి చేయూత అందించనుంది. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి తీపి కబురు అందించింది. పంటనష్టం కింద ఎకరాకు రూ.10 వేలు జమా చేయనున్నట్లు ప్రకటించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లి చేతికి వచ్చే పంటకు భాగా నష్టం వాటిల్లింది. దీంతో అప్పు చేసిన రైతులు లబోదిబోమన్నారు. ఆర్థికంగా నష్టపోయిన ఒక్కో రైతుకు ఒక్కో ఎకరాకు రూ.10 వేలు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది.
ఇప్పటికే బాధిత రైతుల జాబితాను సిద్ధం చేయించింది రేవంత్ సర్కార్. వారికి పరిహారం అందించడానికి కూడా నిధులు విడుదల చేసింది. దీనికి రూ.79.57 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఆగష్టు నెలలో కురిసిన అతిభారీ వర్షాలకు మహబూబాబాద్, సూర్యాపేట ఇతర ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. పంటనష్టం జరిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమా అయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన రెండు నెలల్లోనే రేవంత్ సర్కార్ రైతులకు ఆర్థిక సాయం అందించారు. ఇది పండుగ ముందు రైతులకు భారీ స్వాంతన కలిగించే విషయం.