Telangana Congress: తెలంగాణలో జంపింగ్‌లు ఆగిపోయాయి.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వలసలు నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలోనే అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే తాను తిరిగి గులాబీ గూటికి చేరుకున్నట్టు ప్రకటించారు. ఆయన సడెన్‌గా యూటర్న్ తీసుకోవడంతో వలసలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడం.. కోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించడంతో పార్టీ మారాలని అనుకున్న నేతలు..తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ కోర్టుకు చేరింది. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన గడ్డు పరిస్థితి స్పీకర్ ముందుంది.. ఒకవేళ స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ పోతే కోర్టే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇదే జరిగితే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్, కొత్తగూడెంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు వస్తే తమకు అనుకూలంగా వాతావరణం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు మరోసారి చెక్ పెట్టేసి.. మిగతా ఎమ్మెల్యేలను కూడా లాగేసుకోవాలని అనుకుంటున్నట్టు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి..
ప్రస్తుతం చేరికల ఫైల్‌ను హైకమాండ్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ఈ పరిస్థితుల్లో చేరికలను కొద్దిరోజులు వాయిదా వేయాలని సీఎం రేవంత్‌కు ఆదేశించినట్టు తెలిసింది. అయితే మండలిలో బలం లేనందున అక్కడ బలం పెంచుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మరి కొందరు ఎమ్మెల్సీల బలాన్ని పెంచుకోవడం ద్వారా మండలిలోనూ ఆధిపత్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుతో పాటు.. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. అందుకే కొద్దిరోజులు చేరికల అంశాన్ని పక్కన పెట్టేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోందట.
గతంలో బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని.. కాంగ్రెస్‌ఎల్పీని విలీనం చేసుకుంది. అయితే ఐదేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో గులాబీ బాస్ కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు లేవని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అయితే చేరికలపై కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహన్ని అమలు చేస్తోందన్న చర్చ సైతం లేకపోలేదు. దసరా పండుగ తర్వాత మెజారిటీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లాగేసుకునే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
మరోవైపు చేరికలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్నట్టు తెలుస్తోంది. దసరా తర్వాత పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఎండ్ కార్డు పడేలా చూస్తున్నారట. ఒకవేళ రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమయితే.. ఆ ఎన్నికలో సత్తాచాటి బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని అధికార పార్టీ చూస్తోందట. అయితే ఉప ఎన్నికలు వస్తే.. కాంగ్రెస్ ను దెబ్బ తీయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. ఉప ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ తప్పక బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు.. కూల్చేవేతల విషయంలో రేవంత్‌ను సర్కార్‌ను కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. మొత్తంగా రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో.. పార్టీ మారాలని అనుకుంటున్న నేతలు మాత్రం డైలామాలో పడినట్టు ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Telangana Congress: కాంగ్రెస్‌లోకి చేరికలు ఆగినట్టేనా..!