Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..

Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

1 /8

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తనదైన మార్కు రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటూ మరోవైపు, అపోసిషన్ పార్టీలను ముప్పుతిప్పులు పెడుతున్నారు.   

2 /8

అదే విధంగా సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో హైడ్రాకు జిల్లా కలెక్టర్ కు ఉండే అధికారాలు వచ్చినట్లు తెలుస్తోంది.

3 /8

ముఖ్యంగా హైదరబాద్ పరిధిలో ఉన్న చెరువులను కాపాడుకొవాలనే టార్గెట్ గా హైడ్రా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మూసీనది సుందరీకరణ మీద సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.  

4 /8

ఇదిలా ఉండగా.. ఒకవైపు జీహెచ్ఎంసీ, మరోవైపు హైడ్రా.. ప్రస్తుతంహైదరబాద్ ను అన్నిరకాలుగా డెవలప్ మెంట్ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. జీహెచ్ఎంసీ విషయానికి వస్తే..ఆమ్రపాలీ కాట.. తక్కువ టైమ్ లోనే బాధ్యతలు చేపట్టి అధికారులతో సమన్వయం చేసుకుని పాలన గాడినపెట్టేపనుల్లో స్పీడ్ పెంచారు.

5 /8

అదే విధంగా హైడ్రా రంగనాథ్ కూడా.. చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల్ని గుర్తిస్తు.. ఎప్పటి కప్పుడు కూల్చివేతలు చేపడుతూ.. అక్రమార్కులకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులు కూడా తమదైన  స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు.

6 /8

తాజాగా, కేంద్రం కొంత మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్ని ఏపీకి వెళ్లిపోవాలని విభజన చట్టంలో భాగంగా ఉన్న ఆదేశాలు జారీచేసింది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట కూడా ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఆమ్రపాలీ కాటను టార్గెట్ చేసి పంపించారని వార్తలు వస్తున్నాయి

7 /8

మరోవైపు సీఎం రేవంత్ మాత్రం.. ప్లాన్ బీని రెడీగా ఉంచారంట. ఒక వేళ ఆమ్రపాలీ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే.. ఆ బాధ్యతల్ని ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అప్పగించాలని చూస్తున్నారంట.  ఇప్పటికే హైడ్రా రంగనాథ్ అంటే.. మంచి నిజాయితీ, నిబద్ధత, ముక్కుసూటితనం గల అధికారి అని పేరు.

8 /8

అదే విధంగా.. హైడ్రా, జీహెచ్ఎంసీలు  నగరానికి సంబంధించి, సమన్వయం చేసుకొవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హైడ్రా రంగనాథ్ ను జీహెచ్ఎంసీ పగ్గాలు కూడా ఇస్తే.. ఆయన రెండు డిపార్ట్ మెంట్ లకు కూడా న్యాయం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి  భావిస్తున్నారంట. అతి త్వరలోనే రంగనాథ్ కు జీహెచ్ఎంసీ బాధ్యతల్ని అప్పగిస్తు అధికారికంగా ఉత్తర్వులు సైతం వెలువడుతాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x