Actress Rashmika Latest Post: రష్మిక మనసు దోచిన అలియా జిగ్రా ... !

Rashmika Latest Post Viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అలియా భట్ తాజాగా నటించిన  'జిగ్రా' సినిమాను చూసి రష్మిక ఫిదా అయిపోయింది. సినిమాలో అలియా నటన, కథా ఎంపిక అద్భుతంగా ఉందని రష్మిక పొగడ్తల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా రష్మిక ఈ విషయాన్ని పంచుకుంది.
 

1 /7

అలియా భట్ తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజా చిత్రం 'జిగ్రా' కూడా ఆమె నటనా స్థాయిని మరింత పెంచింది.

2 /7

అలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న తర్వాత నటించిన కొత్త సినిమా 'జిగ్రా'. ఈ సినిమాతో మరోసారి అలియా ప్రేక్షకుల మదిని దోచుకుంది.

3 /7

"జిగ్రా" సినిమాలో ఆలియా భట్, అంకుర్ ఆనంద్ అక్కాతమ్ముళ్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్‌ 11వ తేదీ శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. 

4 /7

జిగ్రా సినిమా చూసిన రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "ఇప్పుడే అలియా భట్‌, వేదాంగ్ నటించిన జిగ్రా చూశాను. అలియా.. నీ టాలెంట్‌ని చూసే అవకాశం దక్కడం మాకు ఇచ్చినందుకు చాలా థాంక్యూ' అని  రాసుకువచ్చింది.

5 /7

ఈ సందర్భంగా సినిమా బృందానికి రష్మిక మందన్న అభినందనలు తెలిపింది.

6 /7

ముంబైలో నిర్వహించిన 'జిగ్రా' సినిమా స్పెషల్ షోకి రష్మిక మందన్న హాజరైన సంగతి తెలిసిందే.  

7 /7

రష్మిక, అలియా భట్ కలిసి ఉన్న ఫొటోలు ప్రేక్షకులను, వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.