Ttd news: తిరుమలలో ఇటీవల సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు పొటెత్తారు. తమ ఇష్టదైవానికి కానుకల్ని సమర్పించుకున్నారు.
తిరుమల వెంకన్నను పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. శ్రీవారిని కళ్లారా చూసేందుకు మనదేశంనుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇటీవల ఘనంగా జరిగాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు (8 రోజులు) కన్నుల పండుగగా జరిగాయి. ఏపీ సర్కారు తరపున సీఎం చంద్రబాబు హజరై.. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో టీటీడీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది.
సీఎం చంద్రబాబు సైతం.. సామాన్య భక్తులే పరమావధిగా స్వామివారి దర్శనం అయ్యేలా చూడాలన్నారు. వీఐపీల విధానం కాస్తంతా తగ్గించాలన్నారు. తిరుమలకు సంబంధించిన అన్ని విషయాల్లోను టీటీడీ అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది.. 16 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించారు. గరుడసేవలో దాదాపు 3.8 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా..7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండగా… మొత్తం 30 లక్షల లడ్డూలను విక్రయించారు.
శ్రీవారికి హుండీఈ సారి అనేక రికార్డులను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. భక్తులకు సమర్పించిన కానుకల రూపంలో.. ఆదాయంగా రూ.32 కోట్లు వచ్చాయని సమాచారం. తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.90 లక్షలు. బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించారు. బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 36 లక్షల భోజనాలు, అల్పాహారం అందించినట్లు తెలుస్తోంది.
ఒకవైపు లడ్డు వివాదం ఉన్న కూడా.. తిరుమలకు భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే... తిరుమలకు ఈ సారి గతంలో కంటే భారీగా ఆదాయం కానుకలు, లడ్డులు అమ్మడం ద్వారా సమకూరిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.