King Cobra Vs Cats: భారీ కింగ్‌ కోబ్రాను ఓ ఆటాడుకున్న చిన్న పిల్లులు.. చివరి ఏం జరిగిందంటే?

King Cobra Vs Cats Viral Video: పిల్లి, పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఇలా ఎలా గొడవకు దిగుతాయని అంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 18, 2024, 11:32 AM IST
King Cobra Vs Cats: భారీ కింగ్‌ కోబ్రాను ఓ ఆటాడుకున్న చిన్న పిల్లులు.. చివరి ఏం జరిగిందంటే?

  

King Cobra Vs Cats Viral Video: నిత్యం సోషల్‌ మీడియాలో పాము చూస్తూ ఉంటాం.. చాలా మంది స్నేక్‌ క్యాచర్స్‌ వాటిని పట్టుకుని ఆడవి ప్రాంతాల్లో వదిలిన వీడియోలు రోజు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ వీడియోల్లో చాలా వరకు నెటీజన్స్‌ను భయం పుట్టించే విధంగానే ఉంటాయి. అయితే వారు కూడా ఇలా వీడియోలను చూసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా మంది స్నేక్‌ క్యాచర్స్‌ రీల్స్‌, వీడియోల రూపంలో వారు చేసే ప్రతిది షేర్‌ చేస్తున్నారు. ఇదే కాకుండా అనుకోకుండా పాములను తీసిన కొన్ని వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. 

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కొంతమంది స్థానికులు పిల్లి, పాముకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఉన్నట్టుండి ఓ పాము దర్శనమిచ్చింది. పాము అక్కడే ఉన్న పొదల నుంచి ఒక్కసారిగా గుడి ప్రాంగణంలోకి భారీ కింగ్‌ కోబ్రా పాకుతూ రావడం గమనించవచ్చు. ఇక్కడే రెండు పిల్లులు కూడా కనిపిస్తాయి. అయితే ఆ రెండు పిల్లులు పామును గమినించాయి.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avinash Yadav..! (@avinashyadav_26)

పాము కూడా గుడికి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇంతలోనే పిల్లులు కూడా పాముల దగ్గరికి చేరుకుంటాయి. అయితే పిల్లులు, పాము ఎదురెదురవుతాయి. దీంతో  వీటి రెండింటికీ జాతి వైరం పెరగడంతో కయ్యానికి దిగుతాయి. ఇలా రెండు పిల్లులు, పాము ఒక్కదానికొక్కటి గొడవ పడతాయ. అలాగే పాము ఒక్కసారిగా ఉన్నట్లుండి పడగ విప్పుతుంది. దీంతో పాము గుడి లోపలికి వెళ్లకుండా ఆ పిల్లులు రెండు అడ్డకుంటాయి. అయితే ఇంతలోనే ఈ ఘటన దూరం నుంచి చూస్తున్న నల్ల మచ్చల పిల్లి కూడా అక్కడికి చేరుకుంటుంది. దీంతో ఆ పిల్లులు అన్ని కలిపి పాముపై గొడవకు దిగడంతో ఒక్కసారిగా పాము అక్కడి నుంచి వెళ్తుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

పామును పిల్లులు ఒక్కసారిగా బెదిరింపులకు గురిచేయంతో పాము ఒక్కసారిగా పొదల్లోకి జారుకుటుంది. అంతేకాకుండా పిల్లులకు పాము ఏమాత్రం హాని చేయ్యకుండా వెళ్లిపోవడంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు. దీంతో పాటు ఈ సన్నివేశాలు అందరూ స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రికరించుకున్నారు. అయితే ఈ ఘటన సోషల్‌ మీడియాలో ఫుల్‌గా వైరల్‌ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి మరో ఘటనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో కూడా పిల్లి.. పాము కయ్యానికి దిగాయి. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

  

Trending News