Multiple Pan Card Issue: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ కార్డ్ అనేది భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. PAN కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా భారతీయ పౌరులకు జారీ చేసే 10-అంకెల ప్రత్యేక గుర్తింపు ఆల్ఫాన్యూమరిక్ నంబర్. PAN అనేది ఒక సంఖ్య. PAN కార్డ్ అనేది పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా జీవిత భాగస్వామి పేరు ఫోటోతో కూడిన నంబర్‌ను కలిగి ఉండే కార్డ్. ఇది బ్యాంకింగ్ పని కోసం ఉపయోగిస్తారు.
పాన్ కార్డ్ జిరాక్స్ కాపీని గుర్తింపు రుజువుగా లేదా పుట్టిన తేదీ రుజువుగా సమర్పించవచ్చు. అయితే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు వాడుతుంటారు. అయితే అది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా ? అనేది చాలా మందికి దీనిపై అవగాహన కూడా ఉండదు. కాబట్టి అలాంటి వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు.
ఆదాయపు పన్ను నియమం ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A (7) ప్రకారం, ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేయలేరు లేదా తీసుకోలేరు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకూడదు. ఇది చట్టబద్ధం కాదు. కానీ ఒకే పాన్ కార్డ్ నంబర్‌కు రెండు వేర్వేరు కాపీలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం కాదు. రెండవ కాపీని డూప్లికేట్ కాపీగా పరిగణిస్తారు.
10 వేలు జరిమానా విధించవచ్చు:
మీరు ఒకటి కంటే ఎక్కువ పాన్ కలిగి ఉన్నందుకు జరిమానా కూడా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే రూ. 10 వేలు జరిమానా విధిస్తారు. దీనిని అసెస్సింగ్ అధికారి నిర్ణయిస్తారు. అయితే దీని తర్వాత మీకు వివరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే, శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు.
పాన్ కార్డ్ ఎందుకు ముఖ్యమైనది?
పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డ్ ముఖ్యం. అన్ని ఆర్థిక లావాదేవీలకు ఈ కార్డ్ అవసరం కాబట్టి, మీ నగదు మార్పిడిని ప్రభుత్వం ట్రాక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చెల్లించేటప్పుడు, రిటర్న్స్ పొందేటప్పుడు పాన్ కార్డ్ ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ కూడా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని కోరింది. దీంతో బ్యాంకింగ్ లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.