Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త కారు రిజిస్ట్రేషన్‌.. కారు మోడల్‌, ధర ఎంతో తెలుసా?

Ram Charan Buys New Car Here Full Details: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్‌ తేజ 'ఆచార్య' ఊహించని పరాజయంతో తదుపరి సినిమాలు ఆచితూచి చేస్తున్నాడు. గేమ్‌ ఛేంజర్‌తో బిజీగా ఉన్న చెర్రీ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాడు. కారు రిజిస్ట్రేషన్‌ కోసం తెలంగాణ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

1 /8

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

2 /8

త్రిబుల్‌ ఆర్‌ తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి చేసిన'ఆచార్య' సినిమా ఊహించని దెబ్బ కొట్టింది.

3 /8

ప్రస్తుతం శంకర్‌తో కలిసి గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా రామ్‌ చరణ్‌ కొత్త కారు కొనుగోలు చేశాడు.

4 /8

తాజాగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్‌ కోసం తెలంగాణ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు.

5 /8

కార్యాలయానికి వచ్చిన రామ్‌ చరణ్‌ను ఆర్టీఏ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతంగా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

6 /8

రామ్‌ చరణ్‌ కొన్న కొత్త కారుకు ఫ్యాన్సీ నంబర్‌ కేటాయించినట్లు సమాచారం. ఆ నంబర్‌ కోసం చరణ్‌ భారీగా చెల్లించినట్లు తెలుస్తోంది.

7 /8

రామ్‌ చరణ్‌ కొనుగోలు చేసిన కారు పేరు రోల్స్‌ రాయిస్‌. ఈ కారు విలువ రూ.7 నుంచి రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం.

8 /8

కొత్త కారు కొనుగోలు చేయడంతో రామ్‌ చరణ్‌ అభిమానులు ఆనందంలో ఉన్నారు. త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌తో అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.