Rahu-shani Gochar Astrology In Telugu: రాహువు గ్రహాన్ని కీడు గ్రహం చెప్పుకున్నప్పటికీ ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా శని గ్రహం కూడా ఇలాంటి కోవాకి చెందినదే.. అయితే 2025 సంవత్సరంలో రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచార దశలో ఉంటాడు. అంతేకాకుండా శని కూడా ఇదే సమయంలో శతభిషా నక్షత్రంలో ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశి చక్రాలపై రెండు గ్రహాల ప్రభావం పడబోతోంది.
రాహువు, శని గ్రహాలు రెండు నక్షత్ర సంచారం చేయడం వల్ల మేష రాశితో పాటు కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంపై కూడా సానుకూల ప్రభావం పడుతుంది. అయితే వచ్చే ఏడాదిలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశివారికి ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారం చేయడంతో వచ్చే సంవత్సరంలో సానుకూల ఆలోచనలో ముందుకెళ్తారు. దీని కారణంగా వీరు బోలెడు లాభాలు పొందుతారు. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలగొచ్చు.
ముఖ్యంగా వృషభ రాశివారికి వ్యాపారాల్లో వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
మిథున రాశివారికి కూడా రాహువు, శని గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీని కారణంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
విదేశీ ప్రయాణాలు చేసే మిథున రాశివారు కూడా బోలెడు లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు వీరికి చాలా అనుకూలంగా మారుతాయి. భాగస్వాముల మధ్య మంచి ఒప్పందాలు జరుగుతాయి. దీని కారణంగా వీరి మానసిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
మేష రాశివారికి కూడా రాహువు నక్షత్ర సంచారం చేయడం వల్ల వచ్చే 2025 సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. దీంతో పాటు అన్ని పనుల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు.
మేష రాశివారికి ఈ సమయంలో సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్న సులభంగా తొలగిపోతాయిన. దీంతో పాటు శాంతి, సంతోషాలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.