Fruits for Diabetes: మధుమేహం రోగులకు గుడ్‌న్యూస్, ఈ 5 పండ్లు హాయిగా తినేయవచ్చు

మధుమేహం అతి ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏయే పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉండనే ఉంటాయి. అందుకే ఈ వివరాలు మీ కోసం..ఈ 5 రకాల పండ్లను మధుమేహం వ్యాధిగ్రస్థులు నిరభ్యంతరంగా తినవచ్చు. 

Fruits for Diabetes: మధుమేహం అతి ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏయే పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉండనే ఉంటాయి. అందుకే ఈ వివరాలు మీ కోసం..ఈ 5 రకాల పండ్లను మధుమేహం వ్యాధిగ్రస్థులు నిరభ్యంతరంగా తినవచ్చు. 
 

1 /6

కివీ కివీ మరో అద్భుతమైన ఫ్రూట్. డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం. ఇందులో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. దాంతోపాటు విటమిన్ కే, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కివీ గ్రైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు

2 /6

ఆలు బఖరా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఇవి తినడం మంచిది. ఈ పండ్లు గుండె, కళ్లు, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కే, మినరల్స్, ఫైబర్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో శరీరం ఫిట్‌గా ఉంటుంది. 

3 /6

డయాబెటిస్‌లో ఏ పండ్లు తినవచ్చు ప్రకృతిలో లభించే కొన్ని పండ్లలో ఫ్రక్టోజ్ అనే నేచురల్ షుగర్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రవేశించాక లివర్‌ను డ్యామేజ్ చేయడం ప్రారంభిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే డయాబెటిస్ రోగులు కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు.

4 /6

ఆపిల్ ఆపిల్ కూడా డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఆపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండాయి.

5 /6

అవకాడో అవకాడో ఖరీదు ఎక్కువైనా ఆరోగ్యపరంగా చాలా మంచిది. డయాబెటిస్ రోగులు ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఇ విటమిన్ బి పెద్దఎత్తున ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

6 /6

ఆరెంజ్ ఆరెంజ్‌లో విటమిన్ సి పెద్దఎత్తున లభిస్తుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు వీలుగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు.