Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్లో చర్చింనున్నారు. ఇక ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఉద్యోగ సంఘాల నాయకులతో గురువారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
మొత్తం 51 డిమాండ్స్‌ను ముఖ్యమంత్రి ముందు ఉంచగా.. ఇందులో ఆరు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.
అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.
ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక రెండు డీఏలను విడుదల చేసే అవకాశం ఉండగా.. రేపు కేబినెట్ మీటింగ్‌లో గ్రీన్ సిగ్నల్ రానుంది.