iPhone 17 Pro Max Design Leaked: త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే Apple iPhone 17 సిరీస్ డిజైన్ లీక్ అయ్యింది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
iPhone 17 Pro Max Design Leaked: 2025 సంవత్సరంలో వచ్చే యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ప్రీమియం లుక్‌లో కనిపించడమే కాకుండా అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచింగ్ ఆలస్యం కావడంతో ఇప్పటికీ ఈ 17 సిరీస్‌పై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటనను చేయలేదు. అయితే త్వరలోనే ఈ ఐఫోన్ 17 సిరీస్‌పై ప్రత్యేకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే ఆ స్మార్ట్‌ఫోన్ అత్యధిక ప్రీమియం లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా ఇటీవలే లీక్ అయ్యాయి.
ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ చూస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్ పరంగా చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రీమియంగా కనిపించేందుకు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కొత్త ఫేస్ ID సిస్టమ్‌ను కూడా అందించబోతోంది.
ఈ కొత్త ఫేస్ ID సిస్టమ్ ద్వారా ఈ సిరీస్‌లో అద్భుతమైన సెక్యూరీటి ఫీచర్స్ అప్డేట్ కానున్నాయి. అంతేకాకుండా ఈ ఐఫోన్ 17 సిరీస్‌లో ఇమేజింగ్ సిస్టమ్ గణనీయమైన అప్‌గ్రేడ్‌తో రాబోతోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అదనంగా ఇతర కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
ఇక ఫ్రంట్ సెటప్‌లో భాగంగా.. ఈ మొబైల్‌లో 24-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెల్పీ కెమెరాలో కూడా 4k రికార్డింగ్ ఆప్షన్‌ను అందిస్తోంది. దీంతో పాటు అద్భుతమైన కొన్ని ఫోటో ఫిల్టర్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
ఈ ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే అత్యధునిక టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది LTPO3 డిస్‌ప్లే టెక్నాలజీతో విడుదల కానుంది. దీని ద్వారా అద్భుతమైన ఫిక్చర్ క్వాలిటీని పొందవచ్చు.
ఈ Apple iPhone 17 Pro Max స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. గ్రీన్ టైటానియం లేదా టీల్ టైటానియం కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.