Money Transfer Scam: ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. నగదు బదిలీ స్కాంలు జరుగుతున్నాయి. నేరగాళ్లు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేయమని అడుగుతుంటారు. ఏదో విధంగా స్కాంలో ఇరుక్కునేలా చేస్తారు. ఎక్కౌంట్ ఖాళీ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తుంటారు. ఇలాంటి మోసాల నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాలి..
అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి ఈమెయిల్ లేదా మెస్సేజెస్ ద్వారా వచ్చే లింక్స్ పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. అన్ని ఎక్కౌంట్లను పటిష్టం చేసుకోండి. పాస్వర్డ్ బలంగా ఉండాలి. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఉండాలి
ఇలాంటి కాల్స్ నమ్మవద్దు ఏదైనా తెలియని నంబర్ నుంచి కాల్ లేదా ఈమెయిన్ వచ్చి మీ వ్యక్తిగత సమాచారం లేదా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండండి. ఎవరు అడిగారనేది ధృవీకరించుకోండి
స్కీమ్ ప్లాన్ స్కామర్లు ప్రజల్ని తమ వలలో వేసేందుకు ఏదో ఒక స్కీమ్ లాంటిది ఆలోచిస్తారు. ఇందులో చాలా దశలుంటాయి. డబ్బులు అడుగుతారు. ఒత్తిడి చేస్తారు. మోసాలకు పాల్పడతారు
తొందరపెట్టడం స్కామర్లు సాధారణంగా ఎక్కువ తొందరపెడుతుంటారు. డబ్బులు వెంటనే బదిలీ చేయకుంటే ఆర్ధికంగా నష్టం వస్తుందని లేదా చట్టపరమైన చర్యలుంటాయని ఇలా రకరకాలుగా ఒత్తిడి చేస్తుంటారు
ఫోన్ కాల్ ఇలాంటి ఫ్రాడ్స్ సాధారణంగా ఫోన్ కాల్ ద్వారా ప్రారంభమౌతాయి. స్కామర్లు దూర పరిచయం ఉన్నవాళ్లలానో లేక బంధువులగానో చెప్పి ఫోన్ చేస్తారు. ఏదో పని ఉందని అత్యవసరంగా డబ్బులు అడుగుతారు. ఇలాంటి కాల్స్ వస్తే అస్సలు నమ్మవద్దు.