Telangana news: సీఎం రేవంత్ సర్కారు మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. తొందరలోనే చీప్ లిక్కర్ తో పాటు, కాస్లీ బీర్ ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా ప్రభుత్వాలు కేవలం లిక్కర్ ను ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయని కొంత మంది రాజకీయ మేధావులు ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఏ సర్కారు ఉన్న కేవలం మద్యం అమ్మడం ద్వారా అదనపు ఆదాయంను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నయని విమర్శిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పండగ వచ్చిన, ఎన్నికలు వచ్చిన కూడా లిక్కర్ ఏరులై పారుతుందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మందుబాబులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మంత లిక్కర్ తాగేందుకు తగలేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీలో ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకుని వస్తామని హమీ ఇచ్చారు. అంతే కాకుండా.. అన్న మాట ప్రకారమే.. ఇటీవల కొత్తగా లిక్కర్ పాలసీనీ సైతం తీసుకొచ్చారు. దీనిపై రాజకీయంగా కూడా పలు ఆరోపణలు వచ్చాయి.
తాజాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచేందుకు పావులు కదుపుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా చీప్ లిక్కర్ లు, కాస్లీ లిక్కర్ లపై పెంపుపై గణనీయంగా ఉంటుందని వార్తలు సైతం వస్తున్నాయి.
చీప్ లిక్కర్ మీద 10 నుంచి 30 రూపాయల వరకు, కాస్లీ బీర్ లు, లిక్కర్ ల మీద .. 40 నుంచి 80రూపాయల వరకు పెంపు ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా..దీనిపైన పెద్ద రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
గతంలో బీఆర్ఎస్ మీద లిక్కర్ రేట్లు పెంచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదేపనిచేస్తుందని కూడా అపోసిషన్ పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అంతే కాకుండా.. ఆరుగ్యారంటీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా వెనుక పడిపోయిందని కూడా ఏకీపారేస్తున్నారు.