Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.
Tofu Manufuctring Business Plan: నేటి యువత ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఉద్యోగాల్లోని అధిక ఒత్తిడి, తక్కువ జీతాలు, స్వతంత్రంగా పని చేయాలనే కోరిక. పెద్ద పెట్టుబడి లేకుండా కూడా మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తులను లేదా సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం చాలా సులభమైంది. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇంటి నుండే వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించడం వంటివి తక్కువ పెట్టుబడితో చేయవచ్చు. మీరు కూడా ఎదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి ఆలోచిస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఎంతో సహాయపడుతుంది.
బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ప్లానింగ్ ఎంతో ముఖ్యం. ఇది ఒక భవనం కట్టడం లాంటిది. ముందుగా పక్కా ప్లాన్ లేకుండా ఎవరూ భవనాన్ని కట్టరు కదా! అదే విధంగా బిజినెస్ కూడా. ఏ వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారు? మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంది? ఎంత లాభం వస్తుంది? అనే కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది.
వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో అంచనా వేసి, ఆ డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే విషయంపై క్లారిటీ ఉండాలి. లేదంటే చిక్కులో పడుతారు. అలాగే బిజినెస్ అంటే ఎల్లప్పుడు లాభాలతో ఉండదు. నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అన్నిటికి తెగించి ఉండాలి. వ్యాపారం కోసం అవసరమైన లైసెన్సులు, పర్మిట్లు తీసుకోవాలి.
అయితే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా..? బిజినెస్‌ల్లో ఫూడ్ వ్యాపారాలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. అందులో టోఫు ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా దేశాలలో ఇది ఎంతో డిమాండ్ ఉన్న బిజినెస్. ఇది శాకాహారులకు చాలా ఇష్టమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, క్యాల్షియం ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ప్రస్తుతం చిన్న షాపుల నుంచి పెద్ద సూపర్ మార్కెట్‌లో కూడా టోఫును అమ్ముతుంటారు. దీని ఎక్కువగా సలాడ్, సూప్‌లు ఇతర ఆహారపదార్థాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ బిజినెస్ ను ఇంట్లో లేదా చిన్న షాపును తీసుకొని కూడా ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు రూ.3 నుంచి రూ. 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ వద్ద అంత డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
టోఫు తయారు చేయడం కోసం మీరు లక్ష రూపాయల సోయాబీన్‌ను కొనగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చీజ్ సోయా మిల్క్‌ను తయారు అవుతుంది. సోయాబీన్ చీజ్‌ని టోఫు అంటారు.
ఈ వ్యాపారంలో మీరు భారీ స్థాయిలో డబ్బులను సంపాదించవచ్చు. నెలకు రూ. 30000 సంపాదించవచ్చు. సంవత్సరానికి ఇంట్లోనే ఉండి రూ. 360000 సంపాదించవచ్చు.