Late Night Sleep: రోజూ రాత్రి 12 తరువాతే నిద్రపోతుంటే అత్యంత ప్రాణాంతకమే

Late Night Sleep: మనిషి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే అవసరం. హెల్తీ ఫుడ్స్ తింటున్నా నిద్ర సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాత్రి వేళ 12 గంటల వరకూ నిద్రపోకుంటే ఈ రోగాలు తప్పవు మరి. తస్మాత్ జాగ్రత్త.

Late Night Sleep: ఆరోగ్యకరమైన జీవితం కోసం వైద్యులు వివిధ రకాల సూచనలు చేస్తుంటారు. అందులో ముఖ్యమైంది ఆహారపు అలవాట్లు, జీవనశైలి. ఈ రెండింటిలో ఏది క్రమం తప్పినా అనారోగ్యం తప్పదు. హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. నిద్ర రోజుకు 7-8 గంటలు కచ్చితంగా ఉండాలి. అంతకంటే ముఖ్యం రోజూ ఎప్పుడు నిద్రపోతున్నామనేది. 

1 /7

రోజూ రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం వల్ల శరీరం మొద్దుబారిపోతుంది. రక్తపోటు సమస్య పెరగవచ్చు. గుండె వ్యాధులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. రోజూ రాత్రి 10 గంటల్లోపు నిద్రపోవడం చాలా అవసరం.

2 /7

రోజూ రాత్రి వేళ అదే పనిగా 12 గంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే కాలక్రమంలో మానసిక సమస్యలు ఉత్పన్నం కావచ్చు.  ఎందుకంటే శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు.

3 /7

రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోయే అలవాటు దీర్ఘకాలంలో జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అధిక బరువు, డయాబెటిస్ కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులకు కారణమౌతుంది

4 /7

రాత్రి అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరాన్ని రిఫ్రెష్‌గా ఉంచకపోవడమే కాకుండా జీవక్రియ, ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10-10-30 గంటల వరకూ నిద్రపోవాలి

5 /7

రాత్రి ఆలస్యంగా అంటే 12 గంటల వరకూ నిద్రపోకుండా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. దీర్ఘకాలంలో అనారోగ్యం పాలవుతారు. ప్రస్తుతం జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, పని ఒత్తిడి వంటి కారణాలతో చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు.

6 /7

రోజూ సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం చాలా అవసరం. అందుకే ఎర్లీ టు బెడ్-ఎర్లీ టు రైజ్ అంటారు. రాత్రి 10 గంటలకే నిద్రించే అలవాటు చేసుకోవాలి. అప్పుడే మెటబోలిజం వేగవంతమౌతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.

7 /7

చాలామంది రోజుకు 7-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుందనుకుంటారు. ఈ క్రమంలో రోజూ రాత్రి 12 దాటాక నిద్రపోయి ఉదయం 8-9 గంటలకు లేస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. రాత్రి ఆలస్యంగా నిద్రించడం మెటబోలిజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.