Pension Hike: పెన్షన్‌దారులకు కేంద్రం భారీ శుభవార్త.. పెన్షన్‌ పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!

Central Government Hike Pesions: సూపర్ సీనియర్ సిటిజన్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వ భారీ శుభవార్త అందించే అవకాశం కనిపిస్తోంది. కారుణ్య భృతి పేరుతో అదనపు పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపునకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 
 

1 /6

సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లు పైబడిన పెన్షన్‌ దారులకు కేంద్రం అదనపు పెన్షన్ అందజేయనుంది. 80 నుంచి 85 ఏళ్ల వయస్సు ఉన్న వారికి బేసిక్ పెన్షన్‌లో 20 శాతం పెంపు ఉండనుంది.   

2 /6

ఇక 85 నుంచి 90 ఏళ్ల వయస్సు ఉన్న పెన్షన్‌దారులకు బేసిక్‌ పెన్షన్‌లో 30 శాతం పెంపు ఉంటుంది.   

3 /6

90 నుంచి 95 ఏళ్ల మధ్య ఉన్న వారికి పెన్షన్‌లో 40 శాతం పెంపు అందుకోనున్నారు. 95 నుంచి 100 ఏళ్ల పెన్షన్‌దారులకు 50 శాతం పెంపు ఉండనుంది.  

4 /6

ఉదాహరణకు ఆగస్టు 1, 1942న జన్మించిన పెన్షన్‌దారులు ఆగస్టు 1, 2022 నుంచి బేసిక్ పింఛన్‌లో 20 శాతం అదనపు పెన్షన్‌ పొందేందుకు అర్హులు అవుతారు.    

5 /6

పింఛన్‌దారులు నిర్ణీత వయస్సును చేరుకున్న మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ పొందేందుకు అర్హులు అవుతారని పెన్షనర్స్ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.  

6 /6

పెన్షన్ పంపిణీలో పాల్గొన్న అన్ని శాఖలు, బ్యాంకులు కొత్త మార్గదర్శకాలపై పెన్షన్‌దారులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో పెన్షన్‌దారులు త్వరగా లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుంది.