Deepika Padukone Date With Six Persons List: బాలీవుడ్లో అగ్ర నాయికగా ఉన్న దీపికా పదుకొణె సినిమాలు తగ్గించి తన భర్త రణ్వీర్ కపూర్‌తో హాయిగా వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె పెళ్లికి ముందు ఈ ఆరుగురితో డేటింగ్ చేశారంట. వారిలో ఓ క్రికెటర్.. ఒక వ్యాపారవేత్త ఉన్నారంట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరేళ్లు: బాలీవుడ్ చక్కటి జంటగా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ పేర్లు వస్తాయి. వారి పెళ్లయి 6 సంవత్సరాలు గడుస్తున్నాయి. తాజాగా దీపికకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పెళ్లికి ముందు కొందరితో డేటింగ్ ఉన్నారు.
నిహార్ పాండ్యా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అనంతరం సినీ పరిశ్రమలోకి దీపికా ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే కొందరు వ్యక్తులతో మంచి అనుబంధం ఉండేది. మోడలింగ్ చేస్తున్న కాలంలో నిహార్ పాండ్యతో దీపికా మొదటి బాయ్‌ఫ్రెండ్ అని తెలుస్తోంది. ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో 2005లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు.
మూడేళ్లు: నిహార్ పాండ్యా, దీపిక మోడలింగ్ చేస్తూ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటూనే ప్రేమికులు అయ్యారు. అనంతరం మూడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని సమాచారం.
ఉపేన్ పటేల్: మోడలింగ్ సమయంలోనే ఉపేన్ పటేల్‌తో కూడా దీపికా అనుబంధం కొనసాగించినట్లు చిత్ర పరిశ్రమలో టాక్. అతడితో కూడా దీపికా కొన్నాళ్లు డేటింగ్ చేశారంట.
ఇబ్రహీంతో: మోడలింగ్ కాలంలోనే దీపికాకు మరో వ్యక్తి ముజమ్మిల్ ఇబ్రహీం పరిచయమై కొన్నాళ్లు కలిసి జీవించారంట. వీరి అనుబంధం కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది.
యువరాజ్ సింగ్: అలనాటి స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో కూడా దీపికా పదుకొణె చనువుగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూనే డేటింగ్‌కు కూడా వెళ్లారని టాక్.
సిద్ధార్థ్ మాల్యా: యువీ తర్వాత దీపికా పదుకొణె వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి అనుబంధం కొనసాగలేదు.