Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో కాకరేపుతున్నారు. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇప్పటికే డెగ్లూరులో, లాతుర్ లో ప్రసంగించారు.
అయితే.. పవన్ నాందేడ్ లో ప్రసగించినప్పుడు మరాఠీలో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ను , ఆయన తల్లి జిజియా బాయిని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా బాబా సాహేబ్ అంబేద్కర్, బాల్ థాకరే గారిని స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అక్కడి వాళ్లలాగా పగిడిసైతం వేసుకున్నారు.
దేశంలో కోసం మోదీ సర్కారు పదేళ్లలో ఏంచేసిందో వివరించే ప్రయత్నంచేశారు. ఆర్టికల్ 370 నుంచి అయోధ్య రామమందిరం వంటి అనేక క్లిష్టమైన సమస్యల్ని మోదీ సరిదిద్దారన్నారు. అంతే కాకుండా.. ఎన్డీయే దేశంకోసం అమలు చేస్తున్న పథకాలను గురించి వివరించారు.
పవన్ కు మహారాష్ట్రలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు తెలుస్తొంది. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. అనేక చోట్ల పవన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లా అనేక ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పవన్ మెనియా.. సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ ట్రెండింగ్ లో ఉంటున్నారు.
పవన్ 16, 17 తేదీల్లో రెండు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. 16న నాందేడ్ జిల్లాలోని డెగ్లూరులోను, లాతూర్ లోనూ ప్రసంగిస్తారు. 17న చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ సభలో, అదేరోజు సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరధిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తమ్మీద ఆయన 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొననున్నారని సమాచారం.
మరోవైపు పవన్ ఈరోజు సభలో..ఓవైసీ బ్రదర్స్ పై మండిపడ్డారు. వారు తల్వార్ తీసుకుని వస్తే.. తాము ఖాళీగా చూస్తు ఊరుకోమని.. మేమే వస్తామంటూ కూడా రెచ్చిపోయారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దేశం కోసం, సనాతన ధర్మం కోసం ఎన్డీయేను గెలిపించాలని కూడా పిలుపునిచ్చారు.