Why Ayyappa Deeksha Devotees Wear Black Clothes: అత్యంత పవిత్రంగా భావించే మాల అయ్యప్ప దీక్షధారణ. శబరిమల అయ్యప్ప కటాక్షం చేసే అత్యంత కఠినంగా చేసే దీక్షలో నలుపు దుస్తులు ధరిస్తారు. అయితే దీక్షకు నలుపు రంగు ఎందుకు ధరిస్తారు? దానివలన ప్రయోజనం ఏమిటో తెలుసుకోండి.
దీక్ష ప్రారంభం: శబరిమల అయ్యప్ప స్వామికి చెందిన మాల అయ్యప్ప దీక్ష. ఈ దీక్షలో చాలా రకాలు ఉంటాయి. మణిమాలతో దీక్షను ప్రారంభిస్తారు.
సామాన్య జీవితం: మండల కాలం అంటే 41 రోజులు. ఈ కాలంలో భవబంధాలకు దూరంగా.. విలాసాలు లేకుండా.. హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా అత్యంత సామాన్యంగా ఉండాల్సి ఉంటుంది.
కఠిన నియమాలు: కటిక నేల మీద నిద్రించడం.. తెల్లవారుజామునే చన్నీళ్లతో స్నానం ఆచరించి.. ఉపవాసం వంటివి చేస్తుండాలి.
ఎన్నో ప్రయోజనాలు: అయ్యప్ప దీక్షధారులు నలుపు దుస్తులు ధరిస్తారు. నలుపు ఉండడం వెనుక చాలా కథలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగాను.. శారీరక.. మానసికపరంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
శనీశ్వరుడు శాంతి: నలుపు అనే అయ్యప్పకు చాలా ప్రీతికరంగా చెబుతారు. నల్ల దుస్తులు ధరించడం వలన శనీశ్వరుడు శాంతించడమే కాకుండా అతడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
వెచ్చదనం: సాధారణంగా అయ్యప్ప దీక్ష చలికాలంలోనే ఉంటుంది. నలుపు దుస్తుల ధారణతో వేడిని గ్రహించడంతో శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
రక్షణగా: శబరిమల దట్టమైన అడవుల్లో ఉండడంతో అక్కడ సంచరించే జంతువుల నుంచి రక్షణగా నల్ల దుస్తులు ఉంటాయి. నల్ల దుస్తులు వన్యప్రాణులను భయపెడతాయి.