Actress Sreemukhi Visits Tirumala Temple: మా ఇంటి బంగారం సినిమా విజయవంతం కావడంతో మొక్కు తీర్చుకునేందుకు నటి, యాంకర్ శ్రీముఖి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సమంతతో కలిసి సినిమా విజయం సాధించడంతో మరోసారి శ్రీముఖి తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు.
Actor Madhavan Tirumala Darshan: తిరుమల వెంకటేశ్వర స్వామిని సుప్రసిద్ధ నటుడు మాధవన్ దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన కుటుంబానికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు.
తిరుమలలో బంగారు ఆభరణాలు మరచిపోయిన భక్తుడికి ఎంతో నిజాయితీగా హౌస్ కీపింగ్ సిబ్బంది అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లోని రూమ్ ఒకరోజు బస చేసి స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. గదిలో రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మరచిపోగా.. అది గమనించిన హౌస్ కీపింగ్ సిబ్బంది ఉన్నత అధికారుల సహాయంతో భక్తుడికి అప్పగించారు.
Tirumala House Keeping Staff Return Devotee Ornaments: చిన్న ఉద్యోగం చేసుకునే హౌస్ కీపింగ్ ఉద్యోగులు నిజాయతీని చాటుకున్నారు. గది శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది అక్కడ కనిపించిన బంగారు ఆభరణాలను గుట్టుచప్పుడు కాకుండా దాచుకోకుండా నిజాయితీగా పోగొట్టుకున్న భక్తుడికి అప్పగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Two Days VIP Break Darshan Cancel In Tirumala Temple: తిరుమల భక్తులకు భారీ అలర్ట్. తిరుమలలో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక దర్శనాలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆణివార ఆస్థానం.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజం నిర్వహిస్తుండడంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు.
Tirumala VIPs Darshan: తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు శుక్రవారం స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సందడి నెలకొంది.
Tirumala VIPs Darshan: తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతోపాటు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సందర్శించారు. వీరిద్దరూ వేర్వేరుగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు.
పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుమల ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నాడు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దయతోనే తనకు పద్మశ్రీ అవార్డు లభించిందని తెలిపారు.
తిరుమల ఆలయాన్ని డైలాగ్ కింగ్ సాయి కుమార్ సందర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో గురువారం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
తిరుమల క్షేత్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.
ప్రతి పౌర్ణమికి చేసినట్టు తిరుమలలో ఏరువాక పౌర్ణమికి ప్రత్యేక వాహన సేవ చేశారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Most Glorious Garuda Seva In Tirumala:ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో అత్యంత వైభవంగా గరుడ వాహన సేవ జరిగింది. ప్రతి పౌర్ణమికి చేసినట్టు ఏరువాక పౌర్ణమికి ప్రత్యేక వాహన సేవ చేశారు. ఈ సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి చూసి తరించారు.
Keerthi Suresh: తిరుమల స్వామివారిని శనివారం ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి వీఐపీ విరామ సమయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వచ్చిన ఆమె అభిమానులు కీర్తి సురేష్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు.
Traffic Jam At Alipiri Tollgate: తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. తిరుమల కొండపైన దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Ashok Leyland Donates Heavy Truck To Tirumala: తిరుమల ఆలయానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ విరాళాన్ని సమర్పించింది. రూ.31 లక్షలకు పైగా విలువైన అధునాతన ట్రక్కును టీటీడీకి విరాళంగా అందజేసింది. శనివారం తిరుమలలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.
Vijayawada: కనకదుర్గ ఆలయం లోని ఇంద్రకీలాద్రికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో ఘాట్ నిర్మాణం పూర్తైతే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రకటనతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Tirumala Sarva Darshan Taking 24 Hours Above Continuing Summer Holiday Rush: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండ భక్త జన సంద్రమైంది. ఎండలు దంచి కొడుతున్నా ఎండల్లోనే భక్తులు ఏడుకొండ స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. దీంతో దర్శనానికి పెద్ద ఎత్తున సమయం పడుతోంది. దీంతో ఆదివారం భక్తులు కొండపైకి రాకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Actress Jaya Prada Visits Srikalahasti Temple: శ్రీకాళహస్తిలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ప్రత్యక్షమయ్యారు. తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న జయప్రద కుటుంబానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రాహు-కేతు పూజ చేశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు.
Jaya Prada: తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు శేఖర్ మాస్టర్‌ను పట్టువస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Devotees Heavy Rush To Yadadri Temple: యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి లక్ష్మీనరసింస్వామిని దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లు కిక్కిరిసిపోగా.. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పట్టగా.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
Devotee Donates Innova Car To Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామికి చెన్నైకు చెందిన భక్తుడు పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్ సుందర్ ఇన్నోవా కారును విరాళంగా ఇచ్చాడు. రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారును టీటీడీ అధికారులకు శుక్రవారం అందించారు. ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కారు తాళాలు అందుకున్నారు.
Nitish Kumar Reddy Visits Tirumala Temple A Head IPL 2026: తిరుమల శ్రీవారిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నాడు. శుక్రవారం నైవేద్య విరామంలో నితీశ్ తన కుటుంబసభ్యులతోపాటు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్‌రావు, ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.