మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం

 మేడారం జాతర సమీపిస్తున్నందున వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Last Updated : Jan 30, 2020, 11:46 PM IST
మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ : మేడారం జాతర సమీపిస్తున్నందున వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 జనసమూహం, ట్రాఫిక్, మంచినీటి సరఫరా , పార్కింగ్ స్థలాలు,  పబ్లిక్ మూమెంట్ , పారిశుద్యం పై దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేసి అన్ని రోడ్లను వినియోగంలోకి తేవాలన్నారు. మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. బారికేడ్లు, గద్దేల వద్ద సౌకర్యాలు, సైనేజస్, షాపులు వద్ద బ్యారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు టీం వర్క్ మాదిరిగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో డి.జి.పి మహేందర్ రెడ్డి , ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు పి.సి.సి.ఎఫ్ శ్రీనివాస్, ములుగు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ , ఎస్.పి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News